సుమంత్ ను వదిలేసిన శివ

శివనాగేశ్వరరావు…మంచి డైరక్టరే..ఖాతాలో కాసిన్ని మంచి సినిమాలు వున్నవాడే..కానీ ఎందుకో వెనుకబడ్డాడు. ఆఖరికి సుమంత్ తో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. పైగా ఆ సినిమాలో తొలిసారి సుమంత్ కూడా భాగస్వామి కావాలనుకున్నాడు. ఆయన వాటా…

శివనాగేశ్వరరావు…మంచి డైరక్టరే..ఖాతాలో కాసిన్ని మంచి సినిమాలు వున్నవాడే..కానీ ఎందుకో వెనుకబడ్డాడు. ఆఖరికి సుమంత్ తో ఓ సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. పైగా ఆ సినిమాలో తొలిసారి సుమంత్ కూడా భాగస్వామి కావాలనుకున్నాడు. ఆయన వాటా కొంత, నిర్మాతలు కొంత కలిపి సినిమా చేయాలనుకున్నారు. కథ, డిస్కషన్లు, స్క్రిప్ట్ అంతా ఓకె. హీరోయిన్ కోసం వెదుకులాట మొదలయింది. 

కానీ ఇప్పుడు సడెన్ గా మరి ఏమయిందో ఈ ప్రాజెక్టు డ్రాపయిందని వినికిడి. అంటే ప్రాజెక్టు ఆగిపోలేదని, సుమంత్ బదులు మరో హీరోతో చేసే ఐడియాలో వున్నారని కూడా తెలుస్తోంది. ఏమయిందో మరి. అయినా సుమంత్ సినిమా చేసి చాలా కాలమయ్యింది. 

రన్నింగ్ లో వున్న హీరోల సినిమాలకే ఓపెనింగ్ లు వుండడం లేదు. మరి సుమంత్ తో సినిమా చేయాలంటే కనీసం డైరక్టర్ అయినా రన్నింగ్ లో వుండాలి..నిర్మాణ సంస్థ అయినా పెద్దదై వుండాలి. అలాకాకుంటే సినిమా థియేటర్లలోకి, ఆ పై జనాల్లోకి వెళ్లడం కష్టం కావచ్చు.