Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరోల లిస్ట్ లోకి సందీప్ కిషన్ కూడా చేరాడు

ఆ హీరోల లిస్ట్ లోకి సందీప్ కిషన్ కూడా చేరాడు

రివ్యూల్ని తిట్టడం ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో ఒక్కొక్కరుగా ఈ లిస్ట్ లోకి చేరుతున్నారు. సినిమా బాగాలేదంటూ రివ్యూ ఇవ్వడమే ఆలస్యం ప్రెస్ మీట్ పెట్టి మరీ రివ్యూ రాసినోళ్లను తిట్టే వాళ్ల సంఖ్య ఎక్కువైంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు.

తెనాలి రామకృష్ణ సినిమా బాగాలేదంటూ రివ్యూలు రాసినోళ్లను విమర్శించాడు సందీప్. రెండు గంటల సినిమాలో ఎక్కడ బోర్ కొట్టిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నాడు.

"నాకు చాలా కాల్స్ వచ్చాయి. అంతా బాగుందంటున్నారు. యూజర్ రివ్యూస్ కూడా బాగున్నాయి. ఏ వెబ్ సైట్స్ అయితే రివ్యూస్ పెట్టాయో, అవే వెబ్ సైట్ యూట్యూబ్ ఛానెల్స్ లో పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. బాగా నవ్వుకున్నామని అంతా అనుకున్నప్పుడు రివ్యూల్లో నెగెటివ్ అంశాలు ఎలా రాస్తారు. మొత్తం సినిమా 2 గంటల 7 నిమిషాలు మాత్రమే. బాగా బోర్ కొట్టిందని రాయాలన్నా అంత టైమ్ లేదు సినిమాలో."

ఫస్టాఫ్ గంట, సెకెండాఫ్ గంట ఉన్నప్పుడు సినిమా ఎందుకు బోర్ కొడుతుందని ప్రశ్నిస్తున్నాడు సందీప్ కిషన్. మరీ ముఖ్యంగా సెకెండాఫ్ లో 4 ఎపిసోడ్స్ హిలేరియస్ గా ఉన్నాయని అన్నప్పుడు బోర్ ఎందుకు కొడుతుందని అడుగుతున్నాడు. రివ్యూల కంటే పబ్లిక్ రెస్పాన్స్ నే తను ఎక్కువగా నమ్ముతానంటున్నాడు.

"కలెక్షన్ల గురించి నేను మాట్లాడను. థియేటర్లకు వచ్చే జనాలు మాత్రం పెరిగారు. ఒకవేళ రిజల్ట్ ఏమైనా తేడా కొడితే సోమవారం ప్రెస్ మీట్ పెట్టి నేనే చెబుతా. పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అదే చెబుతాను. అనుకున్నంత ఆడకపోతే ఆ విషయం కూడా చెబుతా. అప్పుడు రివ్యూలు కరెక్ట్ అని ఒప్పుకుంటా."

ఇదీ తన సినిమా రివ్యూలపై సందీప్ కిషన్ రెస్పాన్స్. కాలం చెల్లిన కథ, రొటీన్ కామెడీతో తెరకెక్కిన తెనాలి రామకృష్ణ సినిమాను ఇలా వెనకేసుకొచ్చాడు ఈ హీరో. సి-సెంటర్ నుంచి మల్టీప్లెక్స్ వరకు ఈ ముతక కామెడీనే క్లిక్ అయిందని గొప్పగా చెబుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?