మరోసారి తెరపైకి మెగా డాటర్ పెళ్లి

నిహారిక కొణెదల పెళ్లి వ్యవహారం మరోసారి మెగా కాంపౌండ్ లో చర్చకు వచ్చింది. గతంలో ఓసారి ఆమె పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పటికీ ఎందుకో అప్పట్లో ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టేశారు. ఈసారి మాత్రం ఓ…

నిహారిక కొణెదల పెళ్లి వ్యవహారం మరోసారి మెగా కాంపౌండ్ లో చర్చకు వచ్చింది. గతంలో ఓసారి ఆమె పెళ్లి విషయం చర్చకు వచ్చినప్పటికీ ఎందుకో అప్పట్లో ఆ వ్యవహారాన్ని పక్కనపెట్టేశారు. ఈసారి మాత్రం ఓ మంచి సంబంధం చూసి నిహారికకు పెళ్లి చేయాలని అనుకుంటోంది మెగా కాంపౌండ్. ఈ మేరకు నిహారిక కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కేవలం సినిమాల కోసమే పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంది నిహారిక. అయితే ఆమె అనుకున్నంత గొప్పగా ఫిల్మీ కెరీర్ సాగలేదు. ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. దీంతో ఇక సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకోవాలని నిహారికకు తండ్రి నాగబాబు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. బడా వ్యాపారాలు చేస్తున్న 2 పెద్ద కుటుంబాలకు చెందిన సంబంధాల్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

నిహారిక పెళ్లిపై గతంలో చాలా పుకార్లు వచ్చాయి. ఒక దశలో ఆమె హీరో నాగశౌర్యను పెళ్లాడుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. కొన్నాళ్ల కిందట విజయ్ దేవరకొండ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే నిహారికకు తను బిగ్ బ్రదర్ లాంటివాడినంటూ విజయ్ దేవరకొండ స్పష్టత ఇచ్చాడు.

అటు హీరో సాయి తేజ్ కూడా నిహారికపై తన అభిప్రాయాన్ని ఎన్నోసార్లు వెల్లడించాడు. తనకు వరస అయినప్పటికీ, కలిసి పెరగడం వల్ల నిహారికను ఎప్పుడూ తను ఆ కోణంలో చూడలేదని చెప్పాడు.

మరోవైపు నాగబాబు కూడా కూతురు పెళ్లిపై ఆమధ్య స్పందిస్తూ, తన కూతురు ఎప్పుడు ఓకే చెబితే అప్పుడే సంబంధాలు చూస్తామని స్పష్టంచేశారు. కూతురు పెళ్లి విషయంలో కులం పట్టింపులు కూడా లేవని స్పష్టంచేశారు.

ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో పెద్దలంతా నిహారిక పెళ్లిని ఓ కొలిక్కి తీసుకొచ్చే అంశంపైనే ఆలోచిస్తున్నారు. చేతిలో ఉన్న 2 సంబంధాల్లో ఒకదాన్ని ఫైనల్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ లోపు నిహారిక పెళ్లి ఉంటుంది. రీసెంట్ గా సైరా నరసింహారెడ్డి సినిమాలో నిహారిక ఓ చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.