సునీల్ కు మరో ఛాన్స్?

వన్స్ డిసైడ్ అయిపోయిన తరువాత కమెడియన్ కమ్ హీరో సునీల్ ను అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఒకరిద్దరు మినహా సరైన కమెడియన్ లేని లోటు ఇండస్డ్రీలో క్లియర్ గా వుంది. ఇలాంటి టైమ్ లో…

వన్స్ డిసైడ్ అయిపోయిన తరువాత కమెడియన్ కమ్ హీరో సునీల్ ను అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. ఒకరిద్దరు మినహా సరైన కమెడియన్ లేని లోటు ఇండస్డ్రీలో క్లియర్ గా వుంది. ఇలాంటి టైమ్ లో ఫుల్ లెంగ్త్ మంచి పాత్రలు వస్తే, చేయడానికి రెడీ అని సునీల్ డిసైడ్ అయ్యారు. దాంతో వరుసపెట్టి పాత్రలు వస్తున్నాయి.

ఇప్పటికే ఎన్టీఆర్-త్రివిక్రమ్, రవితేజ-శ్రీనువైట్ల, అల్లరినరేష్-భీమినేని సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సినిమా కూడా సునీల్ దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. 

రాజశేఖర్ హీరోగా చేయబోయే సినిమాలో మాంచి ఫుల్ లెంగ్త్ పాత్ర ఒకటి సునీల్ ను వెదుక్కుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథ నెరేషన్ వుంది. ఇది కూడా ఒకె అంటే, సునీల్ డైరీ ఫుల్ అయిపొతుంది ఈ ఏడాదికి.

చిన్న ఆపరేషన్

ఇదిలావుంటే హీరో సునీల్ చిన్న ఆపరేషన్ చేయించుకున్నారు. మొహం మీద అక్కడక్కడ చిన్న ఉలిపిరికాయలు లాంటివి పొడచూపడంతో శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించుకున్నట్లు తెలుస్తోంది.