హీరోగా సరైన అవకాశాలు లేకపోయినా, సునీల్ రేటు మాత్రం తగ్గించడం లేదు. మూడు కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట. దర్శకుడు మారుతి, నిర్మాత దానయ్య కలిసి, సునీల్ తో ఓ ఫ్రాజెక్ట్ ఓకె చేయించుకున్నారు. దానికి ఇప్పుడు బేరసారాలు నడుస్తున్నాయి. రెండు కోట్లు ఇస్తామని వీరు, మూడిస్తేనే అంటూ సునీల్ బిగుసుకు కూర్చున్నారని వినికిడి.
దీనిపై గత కొద్ది రోజులుగా కిందా మీదా అవుతున్నారు. వయా మీడియాగా సెటిల్ అవుతుందనుకుంటున్నారు. చేతిలో సక్సెస్ లేకపోయినా, సునీల్ రేటు ఇంత అని టాక్ రావడంతో, మీడియం రేంజ్ డైరక్టర్లు, ప్రొడ్యూసర్లు అమ్మో మూడా అని అతగాడితో సినిమా తీయాలనే మూడ్ నే మార్చుకుంటున్నారట. అన్నట్లు సునీల్ ఇటీవల సినిమా భీమవరం బుల్లోడు ఇంతవరకు శాటిలైట్ కాలేదు. అదీ పరిస్థితి.