తొలి సినిమా 'ఓనమాలు'తో తన మార్కేంటో చూపించాడు క్రాంతిమాధవ్. కమర్షియల్ సినిమాలకు దూరంగా పచ్చటి జ్ఞాపకాలతో ఓ కథ నడిపించిన విధానం ఆకట్టుకొంది. ప్రేమ కథే అయినా తనదైన భావోద్వేగాలతో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమానీ చక్కగా నడిపి మరోసారి క్రెడిట్ కొట్టేశాడు.
మళ్లీ మళ్లీ తరవాత అన్నపూర్ణ కాంపౌండ్‌లో ఓ సినిమా చేస్తాడని చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకొన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సునీల్ కోసం ఓ స్ర్కిప్టు రెడీ చేసుకొన్నట్టు వినికిడి. స్టోరీ నేరేషన్ కూడా జరిగిపోయిందట. ఇదో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
ఈ చిత్రానికి సంతోషం సగం బలం అనే పేరు పెట్టారట. సునీల్ కెరీర్ ప్రస్తుతానికి బీజీ బిజీగా ఉంది. తన చేతిలో రెండు సినిమాలున్నాయి. మరి క్రాంతి మాధవ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.