సావిత్రి, సన్నీ.. ఏ బయోపిక్ అయినా ఆమెతోనేనా!

ఏమిటో.. సినీ రంగానికి సంబంధించిన మహిళా మణుల్లో ఎవ్వరి బయోపిక్ చర్చకు వచ్చినా, విద్యాబాలన్ పేరే వినిపిస్తోంది! ఒక్క బయోపిక్ తో ఈ పరిస్థితి వచ్చి పడింది. ఏ ముహూర్తాన ‘డర్టీ పిక్చర్’ హిట్టైందో…

ఏమిటో.. సినీ రంగానికి సంబంధించిన మహిళా మణుల్లో ఎవ్వరి బయోపిక్ చర్చకు వచ్చినా, విద్యాబాలన్ పేరే వినిపిస్తోంది! ఒక్క బయోపిక్ తో ఈ పరిస్థితి వచ్చి పడింది. ఏ ముహూర్తాన ‘డర్టీ పిక్చర్’ హిట్టైందో కానీ.. అప్పటి నుంచి విషాదాంతం అయిన  ఏ నటీమణి బయోపిక్ విషయంలో అయినా విద్యా పేరే వినిపిస్తోంది!

ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న మహానటి సావిత్రి బయోపిక్ లో విద్యాబాలన్ ను నటింపజేసే యత్నాలు సాగుతున్నాయి. సావిత్రి పాత్ర పోషణ విషయంలో నిత్యామీనన్, సమంత ల పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నాయనే మాట వినిపిస్తున్నా.. విద్యాతో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తన బయోపిక్ తీస్తే అందులో విద్యాబాలన్ నటించాలని అంటోంది సన్నీ లియోన్. ప్రస్తుతం మంచి ఊపు మీదున్న ఈ మాజీ పోర్నో స్టార్ తన జీవిత గాథ ఆధారంగా సినిమా రావాలని ఆకాంక్షిస్తోంది. మరి దాని ద్వారా ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటోందో కానీ.. అందులో తను నటించదట! 

తన పాత్రకు విద్యాబాలన్ అయితే బాగా సెట్ అవుతుందని సన్నీ సూచిస్తోంది. మరి సన్నీ లియోన్ బయోపిక్ ను తీయడానికి అయితే చాలా మంది నిర్మాతలు రెడీగానే ఉంటారు. ఎంత మసాలా కావాలంటే అంత దట్టించుకోవచ్చు కదా అందులో! అయితే.. ఆ పాత్రలో నటించేందుకు విద్య ఒప్పుకుంటుందా?!