ఈ సినీ దర్శకుడు విరాట్ కొహ్లీకి దొరికితే అంతేనేమో!

అసలే.. విరాట్ ఆవేశ పరుడు. ఈ మధ్య కొంత పరిణతి సాధించినట్టుగా కనిపిస్తున్నా, ఆటలో ప్రత్యర్థుల పైన అన్ని రకాలుగానూ విరుచుకుపడే టైపు కొహ్లీ. దూకుడైన మనస్తత్వంతో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు!…

అసలే.. విరాట్ ఆవేశ పరుడు. ఈ మధ్య కొంత పరిణతి సాధించినట్టుగా కనిపిస్తున్నా, ఆటలో ప్రత్యర్థుల పైన అన్ని రకాలుగానూ విరుచుకుపడే టైపు కొహ్లీ. దూకుడైన మనస్తత్వంతో ఇప్పటికే ఇంటర్నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు! ఆటనే అంత సీరియస్ గా తీసుకునే కొహ్లీ.. తన ప్రియురాలి విషయంలో ఇంకెంత గట్టిగా ఉంటాడో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. అందులోనూ.. అనుష్క శర్మతో కొహ్లీది చాన్నాళ్ల అనుబంధం!

వీళ్లు చాలా కాలంగానే ప్రేమలో ఉన్నారు కాబట్టి.. వీళ్ల బంధంలోని గాఢత ఎంతో తెలుసుకోవచ్చు. మరి అలాంటి అనుష్క శర్మ విషయంలో కరణ్ జొహార్ చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశాడనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్వయంగా అనుష్క శర్మ ఈ విషయాలను చెప్పుకొచ్చింది.

‘ యే దిల్ హే ముష్కిల్’ సినిమా షూటింగ్ సమయంలో కరణ్ తనను అనుచితంగా తాకాడని అనుష్క చెప్పింది. అలాగే “ ఈ సినిమా నీ కోసమే తీస్తున్నాను..’’ అని కూడా కరణ్ అనుష్క కే చెప్పాడట! ‘నేను నీకు పడిపోయా..’ అని కూడా చెప్పుకొచ్చాడట! ఈ విషయాలన్నింటినీ అనుష్క శర్మ చెప్పింది. ఈ చెప్పడం అయితే.. నవ్వుతూనే చెప్పింది, కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలోనే ఆమె ఈ విషయాలన్నీ చెప్పింది.
 
ఒకవేళ వేరే సందర్భంలో ఈ మాటలు చెప్పి ఉంటే.. చాలా సంచలనమే అయ్యేవి! ప్రత్యేకించి కరణ్ తనను కావాలని తాకాడని అనుష్క చెప్పడమే చాలు.. రచ్చ చాలా పెద్దదవ్వడానికి! వెనుకటికి బాలీవుడ్ లో ‘నీ కోసమే సినిమా తీశా..’ అని హీరోయిన్లకు చెప్పిన దర్శక, నిర్మాతలు న్నారు. ఇప్పుడు అనుష్క కోసం సినిమా ను తీసేంత స్థాయికి వెళ్లాడట కరణ్!

మరి ఈ విషయాలను ఆమె  బాయ్ ఫ్రెండ్ సీరియస్ గా తీసుకుంటే మాత్రం కరణ్ కు చుక్కలేనేమో! అసలే కొహ్లీకి దూకుడెక్కువ. జాగ్రత్త కరణ్!