ఎవరు ఎన్ని అనుకున్నా, సన్నీ లియోన్ కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఆమెను అడపాదడపా తీసుకోవడం వల్ల, తెలుగు ఫంక్షన్ ల్లో కూడా సన్నీ కనిపిస్తోంది. ఆ మధ్య ఓ బడా కాంట్రాక్టర్ అయితే తన బర్త్ డేకు సన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించి, డ్యాన్స్ చేయించుకుని, చూసి తరించారు.
త్వరలో రాబోయే గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ నెంబర్ వుంది. ఇప్పటికే ఈ పాట వీడియోలు, క్లిప్పింగ్ లు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ 27న జరగబోతోంది. ఈ ఫంక్షన్ కు ఇఫ్పడు సన్నీలియోన్ నే స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఆ ఫంక్షన్ లో తన పాటకు తానే డ్యాన్స్ చేయబోతోంది.
ఇంకేంవుంది జనాలకు భలే ఫ్రీ చాన్స్. లైవ్ లో సన్నీ డ్యాన్స్ చూడడానికి లగెత్తడమే.