సురేందర్-అఖిల్ ఫిక్స్?

మొత్తానికి సైరా సురేందర్ రెడ్డి తరువాత ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లే. అక్కినేని అఖిల్ తో ముందుకు వెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ తో అనుకున్నారు. గీతాలో సినిమా అనుకున్నారు కానీ…

మొత్తానికి సైరా సురేందర్ రెడ్డి తరువాత ప్రాజెక్టు ఫిక్స్ అయినట్లే. అక్కినేని అఖిల్ తో ముందుకు వెళ్లాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ తో అనుకున్నారు. గీతాలో సినిమా అనుకున్నారు కానీ అది తాత్కాలికంగా పక్కన పెట్టి, అఖిల్ తో ముందుకు వెళ్లాలని సురేందర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాత ఎవరు అన్న దగ్గర ప్రాజెక్టు ఆగినట్లు బోగట్టా.

మైత్రీమూవీస్ నా? నిరంజన్ రెడ్డినా? అన్నది తేలాల్సి వుందని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి మాత్రం మైత్రీ మూవీస్ వైపు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇది తేలిపోతే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. 

ప్రస్తుతం అఖిల్ చేస్తున్న బ్యాచులర్ సినిమా ఫస్ట్ హాఫ్ దాదాపు పూర్తయింది. సెకండాఫ్ జరగాలి. వీలయితే ఏప్రియల్ లో విడుదల చేయాలన్నది ఆలోచనగా వున్నట్లు తెలుస్తోంది. కానీ కేవలం నెలన్నర టైమ్ లో రెడీ అవుతుందా? అన్నది చూడాలి. ఏమైనా ఏప్రియల్ తరువాత అఖిల్-సురేందర్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి