ఏషియన్ సునీల్ పై కొద్ది రోజల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారుల తనిఖీలు. రెండు రోజులు హడావుడి. ఇప్పుడు లేటెస్ట్ గా కేఎల్ నారాయణ పై ఆదాయపన్ను అధికారులు సోదాలు.
కేఎల్ నారాయణకు, ఏషియన్ సునీల్ కు కొన్ని సారూప్యాలు వున్నాయి. ఇద్దరూ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు మాత్రమే కాదు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కూడా వున్నాయి. విజయవాడ మాల్ లో కేఎల్ నారాయణకు వాటాలు, థియేటర్లు వున్నాయి.
ఇక ఈ ఇద్దరికీ వున్న మరో సారూప్యం, ఈ ఇద్దరూ కూడా దగ్గుబాటు సురేష్ బాబుకు సన్నిహితులు. ఆయనతో వ్యాపార బంధాలు పుష్కలంగా వున్నవారు. నైజాం లో థియేటర్ల వ్యాపారంలో సునీల్ తో సురేష్ బాబుకు భాగస్వామ్యం వుంది. అలాగే కృష్ణా జిల్లా థియేటర్ల వ్యవహారంలో కేఎల్ నారాయణతో భాగస్వామ్యం వున్నట్లు భోగట్టా.
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, ఏషియన్ సునీల్ పై ఆదాయపన్ను అధికారులు తనిఖీలు జరిపినపుడు అందరూ అనుకున్నది ఏఎమ్ బి మాల్ లెక్కలపై అని. కానీ వినవచ్చింది వేరు. ఎ ఎమ్ బి వెనుక భారీ సంఖ్యలో కడుతున్న అపార్ట్ మెంట్ వ్యవహారాల మీద అని టాక్ వుంది. అందులో సునీల్ తో పాటు బోలెడు మంది భాగస్వాములు వున్నారు.
అలాగే కేఎల్ నారాయణ సినిమా నిర్మాణానికి దిగి చాలా ఏళ్లు అయింది. ఎగ్జిబిటర్ గా కూడా పెద్ద ఎక్కువ ఏమీ హడావుడి లేదు. కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం ఆయన చాలా సైలంట్ గా ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారని వినికిడి.
సో. మొత్తం మీద సురేష్ బాబు కుడి ఎడమల లాంటి ఇద్దరు రియల్ ఎస్టేట్ బంధాలున్న సినిమా జనాల లెక్కలను ఆదాయపన్ను శాఖ ఆరా తీసింది. తరువాత ఎవరు టార్గెట్ అవుతారో?