cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

1045 పేజీల జడ్జిమెంట్ !

1045 పేజీల జడ్జిమెంట్ !

అయోధ్య వివాదాస్పద స్థలం విషయంలో సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనంలోని అయుదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించారు.  ఈ తీర్పును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్వయంగా చదివి వినిపించారు. మొత్తం 1045 పేజీల జడ్జిమెంట్ ను సుప్రీం కోర్టు అప్రూవ్ చేసి జడ్జిమెంట్ అప్‌లోడ్ చేశారు.

వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా చేసి.. ముగ్గురికీ పంచేయాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. విశ్వాసాలు, మతాలు ఆధారంగా కాకుండా రికార్డుల ఆధారంగా మాత్రమే తీర్పు వెలువరిస్తున్నట్లు పేర్కొన్నది. అదే సందర్భంలో పురావస్తు శాఖ వారి రికార్డులనే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్టుగా సుప్రీం పేర్కొన్నది. ఇదే సమయంలో పురావస్తు శాఖ నివేదికలో ముస్లింల వాదనకు అనుకూలంగా ఉన్న భాగాన్ని సుప్రీం కోర్టు పట్టించుకోలేదని బాబ్రీ యాక్షన్ కమిటీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఇదే సమయంలో తీర్పు ఆనందాన్ని కలిగిస్తోందంటూ పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ పేర్కొనడం విశేషం.

సుప్రీం తమ తీర్పులో పేర్కొన్న కొన్ని కీలక అంశాలు ఇవే...

=) పురావస్తు శాఖ రికార్డుల ప్రకారం 12 వశతాబ్దంలోనే వివాదాస్పదంలో ప్రార్థన మందిరం ఉండేది.

=) బాబ్రీని ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితంగా  తెలియదు.

=) ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు కట్టబడలేదు.

=) మతగ్రంథాల ఆధారంగా తీర్పుఉండదు

=) అయోధ్య రాముడిది అనే భావన యావత్ దేశ ప్రజల్లో ఉన్నది. దీన్ని ముస్లిములు కూడా అంగీకరిస్తారు.

=) రాజకీయాలకు, చరిత్రకు అతీతంగా తీర్పు ఉండాలి.

=) ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదు

=) రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది వివాదస్పద స్థలం. దీనిపై రికార్డుల ప్రకారమే తీర్పు.

=) 1942 నుంచి అక్కడి బాబ్రీ మసీదులో నమాజులు జరగడం లేదు

=) 1992లో బాబ్రీ మసీదును కూల్చడం మాత్రం తప్పు.

=) వివాదాస్పద ప్రదేశంలో రామాలయం నిర్మించడానికి మూడునెలలెగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలి

=) అయోధ్యలో ప్రముఖమైన స్థలంలో ముస్లింలు బాబ్రీ మసీదు నిర్మించుకోవడానికి అయిదెకరాల స్థలం ఇవ్వాలి.

ఈ అంశాలను మరింత విపులంగా పేర్కొంటూ సుప్రీం 1045 పేజీల తీర్పు వెలువరించింది. వెబ్ సైట్ లో అప్ లోడ్ కూడా అయిన తీర్పు పీడీఎఫ్ కాపీ.. ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా చెలామణీలోకి వచ్చింది.