‘సరిలేరు’ పాట 15 న?

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో సంక్రాంతి విడుదల టార్గెట్ గా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్…

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్ లో సంక్రాంతి విడుదల టార్గెట్ గా వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి జస్ట్ ఒకటి రెండు స్టిల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అంతకుమించి మరేమీ లేదు.

అవతల కౌంటర్ పార్ట్ గా వస్తున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల 'అల వైకుంఠపురములో' సినిమా నుంచి రెండు పాటలు వచ్చాయి. భయంకరంగా వైరల్ అయ్యాయి

ఇలాంటి టైమ్ లో మహేష్ ఫ్యాన్స్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడికి వత్తిడి పెరిగింది. వాస్తవానికి డిసెంబర్ నుంచి ప్రచారం స్టార్ట్ చేద్దామని, నెల రోజులు ముందుగా అయితే సరిపోతుందని అనుకున్నారు. కానీ బయటకు వదలాల్సిన పబ్లిసిటీ మెటీరియల్ చాలా వుండడం, ఫ్యాన్స్ కూడా ఏదో ఒకటి కంటిన్యూగా వదులుతూ వుండమని కోరుతుండడంతో నవంబర్ 15 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఈనెల 15న ఓ పాట లిరికల్ విడియో వదలబోతున్నారు. కాస్త మంచి సాహిత్యంతో కూడిన ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ మాంచి ట్యూన్ అందించారు. ఈ పాట కచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందని విన్నవాళ్ల నుంచి తెలుస్తున్న సమాచారం.

ఈ పాట తరువాత ఇక వారం వారం ఏదో ఒక పబ్లిసిటీ మెటీరియల్ వదులుతూనే వుండాలన్నది సరలేరు యూనిట్ ఆలోచన. లిరికల్ విడియోలు, విడియో గ్లిమ్స్, ఇలా చాలా వున్నాయని, అవన్నీ ఒక్కోటీ వదులుతారని తెలుస్తోంది.