నా పేరు సూర్య ప్రాజెక్టు బన్నీతో వక్కంతం వంశీ ప్రకటించిన వెంటనే ఇండస్ట్రీ అంతా గుప్పుమన్న వార్త ఒకటి వుంది. ఎన్టీఆర్ కోసం ఎప్పటి నుంచో వంశీ తయారుచేసి పెట్టుకున్న కథనే బన్నీ కోసం ఇచ్చేసాడు అని. ఎన్టీఆర్ ఎంతకూ అవకాశం ఇవ్వకపోవడంతో విసిగిపోయిన వంశీ, గుడ్ బై చెప్పేసి బన్నీ దగ్గరకు చేరిపోయాడు అని అందరూ అనుకున్నారు.
కానీ వక్కంతం వైపు నుంచి ఎటువంటి సమాధానం లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తరువాత 'నా పేరు సూర్య ' ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ బయటకు వచ్చాక మళ్లీ ఎన్టీఆర్ ప్రస్తావన మీడియాలోకి వచ్చింది. ఎన్టీఆర్ మాంచి సబ్జెక్ట్ మిస్ అయినట్లున్నాడు అంటూ.
కానీ అసలు విషయం వేరంట. ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ తయారుచేసింది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అంట. ఆ కథలో ఎన్టీఆర్ ఫుల్ ఫైట్ మోడ్ లో వుంటాడట. ఆ సబ్జెక్ట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సి వుందని తెలుస్తోంది. బన్నీ దగ్గరకు వచ్చినపుడు తన కోసం ఏదైనా డిఫరెంట్ గా కావాలి అంటే ఈ మిలటరీ సబ్జెక్ట్ చెప్తే తీసుకున్నాడట. ఎన్టీఆర్ కోసం తయారుచేసిన యాక్షన్ ఎంటర్ టైనర్ సబ్జెక్ట్ అలాగే వుందని, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి అది చేయడానికి వక్కంతం రెడీ అంట.
కొసమెరుపు ఏమిటంటే, నా పేరు సూర్య ఇంపాక్ట్ టీజర్ చూసి ఎన్టీఆర్ వెంటనే వక్కంతంకు మెసేజ్ పెట్టాడట. చాలా బాగుంది. బన్నీ చాలా బాగా చేసాడు అని.