తిట్టుకునేవాళ్లు తిట్టుకుంటూనే వుంటారు కానీ, ఆర్జీవీ ట్వీట్ లు లేక ట్విట్టర్ చప్పగా మారింది. ఈ మధ్య కత్తి మహేష్ లాంటి వాళ్లు ఆ లోటు పూడ్చడానికి కాస్త ట్రయ్ చేస్తున్నారు. అది వేరే సంగతి. అయితే తిరిగే కాలు, తిట్టే నోరు మాదిరిగా, ట్వీట్ చేసే చేయి కూడా ఖాళీగా వుండలేదు. అందుకే ఆర్జీవీ తన ట్విట్టర్ అజ్ఞాతవాసం వీడి, మళ్లీ వచ్చేసారు. రావడమే కాదు. నేనొచ్చేసానోచ్ అని చెప్పేసారు.
ఆ చెప్పడం కూడా మళ్లీ చిన్న ఇండికేషన్ ఇచ్చారు. పవన్ అజ్ఞాతవాసి సినిమా స్ఫూర్తితో తన ట్విట్టర్ అజ్ఞాతవాసం వీడారట. ఎంట్రీనే పవన్ సినిమాతో స్టార్ట్ చేసారు అంటే, ఇక రేపటి నుంచి పవన్ ను టార్గెట్ ను చేయకుండా వుంటారంటారా? పైగా బాలయ్య సినిమా వస్తోంది. ఈమధ్య బాలయ్య కూడా కొంచెం నచ్చడంలా ఆర్జీవీకి. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ ను తనకు ఇవ్వలేదు కదా?
సో ఈ నెలలో పవన్ సినిమా, ఆపై బాలయ్య సినిమాల టైమ్ లో ఆర్జీవీ ఇక ట్వీట్ లతో ట్విట్టర్ కు మజా తెప్పిస్తారన్నమాట. అన్నట్లు ఆర్జీవీ ట్విట్టర్ లోకి మళ్లీ వచ్చారని, ఆయన వీర భక్తులు వోడ్కా సీసాలు పగుల కొట్టి (కొబ్బరికాయలకు బదులు) ఆనందించారట. అంతే లెండి, రోజుకు ఓ సీసా అయినా ఖాళీ కాదా? ఖాళీ అయినవి ఇలాగైనా ఉపయోగపడవా?