Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూర్య - త్రివిక్రమ్ చర్చలు పూర్తి?

సూర్య - త్రివిక్రమ్ చర్చలు పూర్తి?

సౌత్ ఇండియా సూపర్ స్టార్ లలో ఒకరైన సూర్య నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నాడు. టాప్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఆయన హారిక హాసిని పతాకంపై సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. 

ఈ విషయాలన్నీ ఇంతకు ముందు వెల్లడించినవే. లేటెస్ట్ ఏమిటంటే..సూర్య ఈ ప్రాజెక్టు విషయమై మాట్లాడేందుకు హైదరాబాద్ కు వచ్చారు. పార్క్ హయాత్ తో త్రివిక్రమ్ తో రెండు రోజుల పాటు డిస్కషన్లు జరిపారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తాను అనుకుంటున్న లైన్, సినిమా జోనర్ తదితర విషయాలను వివరించినట్లు తెలుస్తోంది. 

టెంటటివ్ గా ప్రాజెక్టు కు అంగీకారం కుదిరింది. ప్రస్తుతం త్రివిక్రమ్ అ..ఆ సినిమా పనిపై వున్నారు. ఇది పూర్తి కాగానే సూర్య సినిమా స్క్రిప్ట్ మీద దృష్టి పెడతారు. బహుశా ఈ సినిమాను తమిళంలో సూర్య స్వంత బ్యానర్ పై నిర్మిస్తారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?