‘ఏం చేస్తున్నావ్ రష్మీ..’ అంటూ యాంకర్‌గా మారిన ఒకప్పటి సినీ నటి రష్మిని ఆప్యాయంగా పలకరించాడు ‘కరెంట్’ సినిమా హీరో సుశాంత్. ‘కరెంట్’ సినిమాలో రష్మి, హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌కి ఫ్రెండ్‌గా నటించింది. ఓ పాటలో డాన్స్ చేసింది కూడా. ప్రస్తుతం సినిమా అవకాశాల్లేక, బుల్లితెరకు పరిమితమైపోయిన రష్మి, ‘జబర్‌దస్త్’ టీవీ షోతో పాపులర్ అయిన విషయం విదితమే.
రష్మిని ప్రమోట్ చేస్తూ, ఓ ఛానల్ ఆమెతో ఇంటర్వ్యూ నిర్వహిస్తే, ఆ ఇంటర్వ్యూకి వీడియో బైట్ ఇచ్చాడు సుశాంత్. అందులో, రష్మీని పలకరించి, ఆమెతో ‘కరెంట్’ సినిమా టైమ్‌లోని కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్‌ని సుశాంత్ గుర్తుచేసుకున్నాడు. ‘ఆ సినిమా తర్వాత టచ్‌లో లేవెందుకు..’ అని సుశాంత్ ప్రశ్నించడంతో, ఇకపై టచ్‌లో వుంటానని సమాధానమిచ్చింది రష్మి.
ప్రస్తుతం సుశాంత్ ఓ సినిమా చేస్తున్నాడు. అందులో రష్మికి సుశాంత్ ఛాన్సిస్తాడా.? అన్నది చర్చనీయాంశంగా తయారైంది. ఒకటీ అరా సినిమాల్లో నటించిన రష్మి, బుల్లితెరపై ‘యువ’ అనే సీరియల్‌లో కన్పించిన విషయం విదితమే. బుల్లితెరపై యాంకర్‌గా అనసూయ తర్వాత ఆ స్థాయిలో అందాల తారగా గుర్తింపు పొందింది రష్మి.