పాత సినిమాల్లో పంతులమ్మ అప్పట్లో పెద్ద హిట్. లక్ష్మీ, రంగనాథ్ నటించారు. పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. అలాగే తనకు అలాంటి పంతులమ్మ క్యారెక్టర్ చెయ్యడం ఇష్టమని అంటుంది నిత్యామీనన్.
ఎందుకు ఆ పాత్ర అంటే మోజు? అనడిగితే, టీచర్ పాత్ర ఉదాత్తంగా వుంటుంది. పిల్లలకు పాఠాలు చెప్పి, వాళ్ళని తీర్చిదిద్దడం సంతృప్తిగా వుంటుంది.. అంటున్న నిత్యామీనన్‌కు అలాంటి పాత్రల్లో షకీలా, అభినయశ్రీ, రమ్యశ్రీ నటించి భ్రష్టుపట్టించిన సంగతి తెలియదు కాబోలు.
నిజానికి ఏ డైరెక్టర్ ఆమెకు పంతులమ్మ క్యారెక్టర్ ఇచ్చినా, సెక్సీగా చూపించకుండా వుంటాడా? కాలేజీ కుర్రాడితోనే టీచర్ లవ్‌లో పడే పాత్రలు వుంటాయప్పుడు. అయితే నిత్యామీనన్ అభిరుచిని మెచ్చుకోవాల్సిందే. ఎప్పుడూ హీరో వెనకాల పడి పాటల్లో గంతులెయ్యడం, కళ్ళతో రెచ్చగొట్టడం లాంటివన్నీ ఆ పాత్రల్లో వుండవని కాబోలు. చూడాలి ఇంకా బోలెడంత కెరీర్ వుంది కదా. ఏదో ఒక రోజున స్లీవ్ లెస్ జాకెట్టులో.. నాభి కిందకు చీరకట్టి గ్లామరస్ టీచర్‌గా నిత్యామీనన్ కనిపించకపోతుందా.?