మా అబ్బాయిని ఎప్పుడో హీరోని చేసి వుండాల్సింది

తెలుగు సినిమాల్లో తిరుగులేని కమెడియన్‌. తన కామెడీతో సోలోగా సినిమాలను హిట్‌ చేసిన నట కిరీటి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నటించిన ‘టామీ’ విడుదలయి ఫర్వాలేదను అనే టాక్‌ సంపాదించుకుంది. ఆ సినిమాను రాజేంద్రప్రసాద్‌ ఒప్పుకోడానికి…

తెలుగు సినిమాల్లో తిరుగులేని కమెడియన్‌. తన కామెడీతో సోలోగా సినిమాలను హిట్‌ చేసిన నట కిరీటి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ నటించిన ‘టామీ’ విడుదలయి ఫర్వాలేదను అనే టాక్‌ సంపాదించుకుంది. ఆ సినిమాను రాజేంద్రప్రసాద్‌ ఒప్పుకోడానికి తగిన కారణం ఏంటంటే పాత సినిమాల్లో జంతువుల పాత్రలు కూడా ఎంతో గొప్పగా వుండేవి, ‘రాము’ సినిమాలో ఒక కుక్క నటించింది. 

అప్పుడు ఎన్టీఆర్‌ కొడుకు మూగవాడు మంటల్లో చిక్కుకుంటే కుక్క రక్షిస్తుంది. అలాగే అప్పట్లో హీరోయిన్‌ శ్రీప్రియ నటించిన ‘పొట్టేలు పున్నమ్మ’ పెద్ద హిట్‌. ‘నోము’ సినిమాలో పాము నటించింది. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం. నేటి తరానికి వాటి విశిష్టత గురించి తెలియాలి.. అంటున్నాడు రాజేంద్రప్రసాద్‌. ఇప్పుడు తన కొడుకు బాలాజీని హీరోగా పరిచయం చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే గత ఎనిమిదేళ్ళ క్రితమే బాలాజీని హీరోగా అడిగారట. చదువు కోసం నో అన్నాడట. 

అలాగే రాజేంద్రప్రసాద్‌ మంచి బూమ్‌లో వుండగానూ బాలనటుడిగా అడిగినప్పుడు కాదన్నారట. ఇప్పుడు లేటయ్యిన మాట వాస్తవమేననీ అయితే తనలా కామెడీ పాత్రలతోపాటు రెగ్యులర్‌ హీరో పాత్రలు కూడా చేసే విధంగా బాలాజీ కెరీర్‌ ప్లాన్‌ చేస్తున్నాడట ఈ నట కిరీటి.