ఒక ఫైవ్ స్టార్ హోటల్ వ్యభిచరిస్తూ పట్టుబడిన నటి శ్వేత బసు ప్రసాద్ ను రెస్క్యూ హోమ్ నుంచి బయటకు రప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె మూడు నెలల పాటు రెస్క్యూ హోమ్ లోనే ఉండాల్సి ఉంది. ఇంకా నెల రోజులు కూడా గడవకుండానే ఇప్పుడు ఆమెను బయటకు రప్పించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు ఉన్నతస్థాయి వ్యక్తులని.. పై స్థాయిలో ఉన్నవాళ్లని తెలుస్తోంది. తమ ఇన్ ఫ్లూయెన్స్ ను ఉపయోగించుకొని వారు శ్వేతను రిమాండ్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్లు అనుకొన్నట్టుగాజరిగితే.. అతి త్వరలో శ్వేత చాలా సైలెంట్ గా రిమాండ్ హోమ్ నుంచి ఇంటికి చేరే అవకాశాలున్నాయని సమాచారం.
మరి శ్వేతను రిమాండ్ నుంచి తప్పించడం ఎందుకు? ఆమె ను అక్కడి రక్షించాల్సిన అవసరం ఏమిటి? అంటే… ఆ పెద్దలకు చాలా రకాల భయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కువ రోజులు శ్వేత అక్కడే ఉంటే.. తమ పేర్లు, తమ వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోననని వారు భయపడుతున్నట్టు తెలుస్తోంది. శ్వేతలాంటి హీరోయిన్లను రంగంలోకి దించి వ్యభిచారం అనే వ్యాపారాన్ని చేస్తున్న వాళ్లు.. ఎలాగైనా ఆమెను రిమాండ్ ను తప్పించాలనుకొంటున్నారు. ఎక్కువ రోజులు ఆమె అక్కడే ఉంటే.. ఏదో ఒక సందర్భంలో తమ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందనేది వారి భయం.
రాజకీయ నేతల్లో మంచి పలుకుబడి కూడా ఉన్న ఆ బ్రోకర్లు.. ఆ ఇన్ ఫ్లుయెన్స్ ను కూడా ఉపయోగించుకొని శ్వేతను విడుదల చేయించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆమె అక్కడ ఉండటం తమ వ్యాపార ప్రయోజనాలకు మంచిది కాదని… వారు వాపోతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతం అవుతాయో.. శ్వేత ఎప్పుడు విడుదల అవుతుందో!