స్విమ్ సూట్ లో పూజాహెగ్డే

డిజె హీట్ మెల్లమెల్లగా అందుకుంది. రంజాన్ హాలీడే కలిసి రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద వున్నారు. ఇప్పటికే వదిలిన ట్రయిలర్లు, సాంగ్ ప్రోమోల్లో బన్నీ తో సమానంగా పూజా హెగ్డే కూడా…

డిజె హీట్ మెల్లమెల్లగా అందుకుంది. రంజాన్ హాలీడే కలిసి రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద వున్నారు. ఇప్పటికే వదిలిన ట్రయిలర్లు, సాంగ్ ప్రోమోల్లో బన్నీ తో సమానంగా పూజా హెగ్డే కూడా ఫ్యాన్స్ ను అటు లాగేస్తోంది. పాటల్లో మెలికలు తిరిగిపోతూ ఆమె ప్రదర్శించిన భంగిమలు ఇప్పుడు సినిమాకు మరింత బజ్ తెచ్చాయి.

లేటెస్ట్ విషయం ఏమిటంటే, డిజె సినిమాలో పూజా హెగ్డే మాంచి గ్లామరస్ వి కట్, సింగిల్ పీస్ స్విమ్ డ్రెస్ లో కనిపిస్తుందట. ఆ సీన్ కేకే కేక అని వినికిడి. సినిమా మొత్తం మీద పూజ ఎక్కడా ఏమాత్రం మొహమాట పడకుండా నటించేసిందట.

ఈ సీన్ పెడదామా అని దర్శకుడు హరీష్ శంకర్ అడగ్గానే, ఓ ఎస్ అనేసిందట పూజా. అంత కోపరేటివ్ హీరోయిన్ దొరకాలే కానీ సినిమాలో సీన్లు చించి ఆరేసెయ్యరా?