ఆఫ్ ది రికార్డుగా మాట్లాడమంటే, సినిమా జనాలు తమ తమ స్టయిల్స్ లో మాట్లాడేస్తారు. బాహుబలి హీరో ప్రభాస్ కూడా ఇందుకు ఏమీ అతీతం కాదు. అందుకే రాజమౌళి, 'డార్లింగ్.. బాహుబలి పార్ట్ 3' అనగానే చటుక్కున..'అమ్మనీయమ్మ' అనేసాడు. క్షణం కూడా పాజ్ తీసుకోకుండా.
బాహుబలి విలన్ రానా ఫస్ట్ టీవీ షో ని హోస్ట్ చేస్తున్నాడు. నెంబర్ వన్ యారి అనే ఈ షో జెమిని టీవీలో ఈ నెల 25న స్టార్ట్ అవుతుంది. ఈ షో కోసం చేసిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో బయటకు వచ్చింది.
ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి, డార్లింగ్, అర్జెంట్ గా కలవాలి అని ప్రభాస్ తో అనడం, వెంటనే ప్రభాస్.. అమ్మనీయమ్మ అనడం చకచకా జరిగిపోయింది.
అలాగే ఎవరి పేరు చెప్పి ఎన్ని భాణాలు వేసినా గురికి చేరలేదు కానీ, పవన్ కళ్యాణ్ అని రానా అనగానే రాజమౌళి వేసిన బాణం నేరుగా వెళ్లి సెంటర్ స్పాట్ లో తగలడం మరో అట్రాక్షన్. మొత్తం మీద ఈ షొ కి ఇంట్రస్టింగ్ ప్రోమో కట్ చేసారు.