టాలీవుడ్ లో దేన్నయినా ఇట్టే పక్కదారి పట్టించేయగలరు. టీజర్లు, ట్రయిలర్లు, ఫస్ట్ లుక్ లు, వీటి లైక్ లు, ట్రెండింగ్ లు కూడా ఆర్టిఫిషయల్ గా మార్చేసారు. ఇప్పుడు
ఊ అంటే వన్ డే లో లైకుల వర్షం కురుస్తోంది.
ఈ విషయంలో గతంలోనే వెల్లడించాం లైకుకు 65 పైసలు, మరీ ఎక్కువైతే 45 పైసలు వంతున తీసుకుని, చేస్తున్నారని. వివిథ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రకటనల కింద ప్లేస్ చేయడం, ఫేస్ బుక్ ఐడిలకు లక్షల్లో పోస్టులు డంప్ చేయడంతో పాటు, ట్రయిలర్ లేదా టీజర్ ను ముందే తీసుకని, ఆఫ్ లైన్ లో లైక్ లు బిల్డ్ చేయడం వంటివి చేసే కంపెనీలు పుట్టుకు వచ్చాయి.
అయితే ఈ మధ్య లక్ష, రెండు లక్షల హిట్ లతో సరిపెట్టుకోవడం లేదు. వన్ మిలియన్, టూ మిలియన్ అంటున్నారు. దీంతో సదరు సాఫ్ట్ వేరు జనాలు కూడా రేటు బాగానే తగ్గించారట. బల్క్ గా మిలియన్ల లెక్కన కావాలంటే జస్ట్ హిట్ కు 15 పైసలకే చేసేస్తున్నట్లు వినికిడి.
అప్పుడు కూడా ఈ హిట్ లకు నిర్మాతకు తక్కువేం ఖర్చు కాదు. లక్షల్లోనే అవుతుంది. కానీ హీరోల మెహర్బానీ కోసం, సినిమాల ప్రచారం అంటూ ఇలా ఖర్చు చేయక తప్పడం లేదు. ఈ మేనియా కొన్నాళ్లు వుంటుంది. జనం ఈ హిట్ ల లెక్కలను పట్టించుకోవడం మానేసాక, వదిలేస్తారేమో?