డబ్బులున్న వాళ్లు రియాలెస్టేట్ లో పెట్టుబడులు పెట్టి, భారీ లాభాలు ఎలా సాధించగలరో అనేక మంది ఉదాహరణలుగా నిలుస్తున్నారు. స్టార్లతో మొదలుపెడితే, సామాన్యుడి వరకూ డబ్బులుంటే భూములు, స్థలాలు, ఇళ్ల మీద వెచ్చించేస్తున్న తరుణం ఇది. జాక్ పాట్ తగిలిందంటే .. భారీ లాభాలు సొంతం చేసుకోవడం కల ఏమీ కాదు!
తాజాగా అమితాబ్ బచ్చన్ ముంబైలో తన డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అమ్మిన ధర భారీ స్థాయిలో ఉంది. 5000 స్క్వైర్ ఫీట్స్ కన్నా కాస్త పెద్దదైన ఆ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను అమితాబ్ ఏకంగా 83 కోట్ల రూపాయలకు అమ్మారట. ఈ మేరకు ధరకు రిజిస్ట్రేషన్ కూడా జరిగిందట!
ఇది కాదు ఆశ్చర్యం, దాన్ని అమితాబ్ కొన్న ధర కేవలం 31 కోట్ల రూపాయలు మాత్రమే! 2021లో అమితాబ్ ఆ ప్రీమియం డ్యూప్లెక్స్ బిల్డింగ్ ను 31 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారని కూడా రిజిస్ట్రేషన్ వివరాలే చెబుతున్నాయి.
నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి గాక ముందే ఇప్పుడు ఏకంగా 83 కోట్ల రూపాయల ధరకు అమితాబ్ దాన్ని అమ్మడం గమనార్హం. నాలుగు సంవత్సరాల్లో దాని విలువ ఏకంగా 168 శాతం పెరిగినట్టు. ఈ బిల్డింగ్ మీదే అమితాబ్ ఏకంగా యాభై కోట్ల రూపాయల లాభం పొందినట్టు!
ఇదంతా అధికారిక లెక్కలు చెబుతున్న విషయమే. ముంబైలో సంపన్నులు ఉండే ప్రాంతాల్లో ఒకడైన అంధేరీ ఏరియాలో అమితాబ్ ఈ బిల్డింగ్ ను కొని, అమ్మారు! మరి అమితాబ్ బచ్చన్ ఇల్లు కావడంతోనే కొనే వాళ్లు అంత ధర పెట్టి ఉంటారని అనుకోవడానికి ఏమీ లేదు. అది ఏయన దీర్ఘకాలం నివసించిన ఇల్లు ఏమీ కాదు. అలాంటి సెంటిమెంట్ తో కొనడానికి కూడా.
రియలెస్టేట్ వ్యాపారం తరహా డీల్ లాగా ఉందంతే! కౌన్ బనేగా కరోడ్ పతి తర్వాత అమితాబ్ పట్టిందంతా బంగారం అవుతూనే ఉంది. లేటు వయసులో ఆయన చేస్తున్న సినిమాలకు కూడా భారీ రెమ్యూనిరేషన్లు పొందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు రియలెస్టేట్ లో కూడా బచ్చన్ స్టార్ డమ్ కొనసాగుతున్నట్టుగా ఉంది.
very good for the country.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు