మన సమస్త అనారోగ్యాలకు మూలకారణం మన జీవనసరళిలో ముఖ్యమైన మూడిటి మధ్య తూకం తప్పడం! శరీరం, మెదడు, హృదయం – యీ మూడిటి మధ్య మనిషి సమతూకం పాటించాలి. అప్పుడే అతను పరిపూర్ణుడవుతాడు.
మొదటగా శరీరం గురించి నా సలహా ఏమిటంటే, ఆరోగ్య పరిరక్షణ ద్వారా శరీరాన్ని కాపాడుకోండి. ఆటల్ని చూడడం మాని ఆడడం మొదలెట్టండి. దురదృష్టవశాత్తూ స్కూళ్లలో డ్రిల్ పీరియడ్స్ లేకుండా చేశారు. ప్లే గ్రౌండ్స్ లేకుండానే స్కూళ్లు నడిపేస్తున్నారు. శరీరానికి వ్యాయామం లేకుండా చేశారు. ఇళ్లలో పెద్దలు చూడబోతే – పిల్లలను ఆటలకు పంపడం లేదు. వేసంగి సెలవుల్లో కూడా ఓ మూల కుదేసి ఎమ్‌సెట్‌కు చదివిస్తున్నారు. టీవీలో ఆటలు చూసి, కంప్యూటర్‌లో యానిమేషన్ గేమ్స్ అడి మేం స్పోర్ట్‌స్ లవర్స్ అనుకుంటున్నారు. కుర్చీలకే పరిమితం కావడం వలన సంపాదించిన దానిలో సగం మందుల పైనే ఖర్చు చేస్తున్నారు.
ఔట్‌డోర్‌లో క్రీడలు ఆడాలి. ఆటల వల్ల శరీరానికి ఆరోగ్యమే కాదు, ఓడిపోతే తట్టుకునే స్థయిర్యం కూడా అలవడుతుంది. స్పోర్టివ్ స్పిరిట్‌తో బాటు పదిమందితో కలిసి ఎలా మెలగాలో నేర్పే టీమ్ స్పిరిట్ కూడా అలవడుతుంది. స్కూలు లోనే యోగా, మెడిటేషన్ కూడా నేర్పితే ఉత్తరోత్రా జీవితంలో ఎదురయ్యే టెన్షన్‌లనుండి ఎలా బయటపడాలో కూడా తెలుస్తుంది. మీ ఆరోగ్యం కాపాడుకోకపోతే మీరు నిర్వహించే సంస్థ యిమేజి కూడా దెబ్బతింటుందని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరిరక్షణ అత్యవసరం.
మన భాగ్యనగరం రోజురోజుకీ కాలుష్యమయం అవుతోంది. ఇది నగరవాసుల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతోంది. శరీరానికి అనువుకాని పనివేళలు వారిని మరింత కృంగదీస్తున్నాయి. దీనికి తోడు ఆధునికమైన పోకడలను అలవర్చుకుని ఆహారవిహారాలలో నగరవాసులు నియమబద్ధంగా వుండటం లేదు. ట్రాఫిక్ కారణంగా ఎంతో సమయం వ్యర్థమై నగరవాసులకు వ్యాయామం చేసే అవకాశమే వుండటం లేదు. వీటివల్ల గ్రామవాసుల కంటె నగరవాసులు మరింత అనారోగ్యపీడితులవుతున్నారు.
సిటీలో క్రీడాస్థలాలు, బహిరంగ ప్రదేశాలు, ఈతకొలనులు కరువైపోతున్నాయి. ఏవో కొన్ని వున్నా, అక్కడిదాకా వెళ్లివచ్చే సమయం దుర్లభమైపోతోంది. ఈ పరిస్థితిలో తక్కువ సమయంలో, శరీరమే సాధనంగా ఎక్కువ ఫలితాలను సముపార్జించే యోగాయే మనకు శరణ్యం. ఏ విధానానికి చెందిన వైద్యుడైనా సరే, యోగా చేయమని, ధ్యానం అలవర్చుకోమని సలహా యిస్తూనేవున్నారు. జంటనగరాలలో ఐదు వేల యోగా సెంటర్లు వున్నాయని 3, 4 లక్షలమంది యోగా నేర్చుకుంటున్నారని పత్రికల భోగట్టా. నానాటికి పెరుగుతున్న మన గ్రేటర్ హైదరాబాదు జనాభాతో పోలిస్తే ఈ అంకెలు చాలా తక్కువనే చెప్పాలి.
యోగా మరింతగా ప్రచారంలోకి రావాలంటే కార్పొరేట్ సంస్థలు పూనుకోవాలి. కనీసం తమ ఉద్యోగుల బాగోగుల కోసమైనా ముందుకు రావాలి. కార్పొరేట్ వ్యవస్థ అంటేనే ఒత్తిళ్లమయం. శారీరక వ్యాయామం కోసం జిమ్‌లకు వెళ్లే సావకాశం ఏ మాత్రం వుండదు. ఉద్యోగి, అతని కుటుంబసభ్యులు మానసికంగా, శారీరకంగా వున్నప్పుడే పనిసామర్థ్యం మెరుగుపడుతుంది. చక్కటి ఫలితాలు రాబట్టడం జరుగుతుంది. హెల్త్‌కేర్ వ్యాపారంలో వున్న కార్పొరేట్‌లు అందరి కంటె ముందుగా ఈ సామాజిక అవసరానికి స్పందించాలి.
ఈ ఉద్దేశం తోనే నేను ‘స్వధర్మయోగి’ డా. సి.వి.రావు నెలకొల్పిన కపిలమహర్షి రిసెర్చి ఫర్ రిసోర్సెస్ అనే సంస్థకు పేట్రన్‌గా, చైర్మన్‌గా వున్నాను. కపిలమహర్షి సాంఖ్యయోగాన్ని, పతంజలి మహర్షి హఠయోగాన్ని కలగలిపి ఆధునిక జీవనశైలికి అనువుగా, అన్ని మతాలవారికి ఆమోదయోగ్యంగా, జనరంజకంగా స్వధర్మవిధానాన్ని తీర్చిదిద్దారు. ఈ సంస్థ ద్వారా ‘యోగా అండ్ అర్బన్ లైఫ్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని విడుదల చేశాం. ఒక నగరవాసి ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలేమిటి, వాటికి కారణాలేమిటి అని చర్చించడంతో బాటు వాటిని అధిగమించడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన ఆసనాలను కూడా వివరించడం జరిగింది. కంప్యూటర్‌పై పనిచేసే ఎగ్జిక్యూటివ్స్, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు – యిలా అన్ని తరగతులవారి ప్రత్యేక సమస్యలను పేర్కొని వాటికి పరిష్కారమార్గాలు సూచించడం జరిగింది. ఆహారం ఎలా వుండాలో విపులంగా చెప్పడం జరిగింది.
కాలుష్యం పెరిగిన కొద్దీ శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. దానికి ప్రాణాయామమే సరైన చికిత్స. కంప్యూటరైజేషన్ పెరిగిన కొద్దీ శారీరక శ్రమ తగ్గి, స్థూలకాయం వస్తుంది. కళ్లు తడి ఆరిపోవడం, మెడ, వెన్ను, పిక్కలు నొప్పి పెట్టడం ఎక్కువ అవుతాయి. వీటిని నివారించడానికి యోగాభ్యాసం అనువైన, సులువైన సాధనం.
ఇక రెండోది – మెదడు. పురాతన కాలంలో ప్రపంచమంతటికీ జ్ఞానజ్యోతులు పంచిన జాతి మనది. అయితే పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక యుగం నడిచినప్పుడు మనం రెండు శతాబ్దాల దాస్యంలో మగ్గడం చేత వెనుకబడిపోయాం. సైన్సులో మనకున్న నోబెల్ గ్రహీత యీనాటికీ ఒక్కరే! అయినా యీ రోజు ప్రపంచం మన వంక చూస్తోందంటే దానికి కారణం భారతీయ మేధ! భారత్‌లో చిరునామా లేని ఏ అంతర్జాతీయ కంపెనీ కైనా సమీపకాలంలో అడ్రసు గల్లంతవుతుందని అభివృద్ధి చెందిన దేశాల పత్రికలే ఘోషిస్తున్నాయి. అందుకే మనతో చేతులు కలపడానికి ఆ దేశాలన్నీ ఉవ్విళ్లూరుతున్నాయి.
ఇది చూసి మనం జబ్బలు చరుచుకుంటే లాభం లేదు. చైనాతో పోటీ పడవలసి వుంటుందన్న ఒక్క సంగతి గుర్తుకు వస్తే చాలు చెమట్లు పడతాయి. అక్కడి ప్రజలు కష్టజీవులు, నాయకులు ముందుచూపు కలవారు, చిత్తశుద్ధి కలవారు. వారితో పోలిస్తే మన జనత, ప్రభుత ఎంతో వెనుకబడి వుంది. మన సమాజంలోనూ ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మనకు మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు కావాలంటే మేధస్సు వున్న యువత నుండే రావాలి.
బాగా చదువుకున్న వారిలో కొందరైనా ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల, పరిశ్రమ అవసరాలను అవగతం చేసుకోవాలి. విధివిధానాలను రూపొందించడంలో, సాంకేతిక ప్రగతి సాధించడానికి వీలైన వాతావరణం కల్పించడంలో క్రియాశీలక పాత్ర వహించాలి. అటువంటి యువత తయారు కావాలంటే మనకు మంచి పాఠశాలలుండాలి, మంచి ఉపాధ్యాయులుండాలి. వారు ఆరోగ్యంగా పెరిగే వాతావరణం అంటే క్రీడాస్థలాలు, లేబరేటరీలు, గ్రంథాలయాలు వుండాలి. అందరూ పుస్తకాలు చదివి జ్ఞానం, కల్పనాశక్తి అలవరుచుకుని మెదడుకి పదును పెట్టాలి. కళలను ఆస్వాదించి, హృదయాన్ని ఆహ్లాదపరచుకుని, బుద్ధిని, హృదయాన్ని సమన్వయం చేసుకోవాలి.
ఇక మూడోది అతి ముఖ్యమైనది హృదయం, దృక్పథం – మన భారతీయతలోనే ఆధ్యాత్మికత వుంది. మన జీవనవిధానంలోనే ఒక కట్టుబాటు, క్రమశిక్షణ, నియమం వుంది. అందుకనే ప్రపంచమంతటినీ కుదిపివేస్తున్న ఆర్థిక సంక్షోభం మనను అంతగా కల్లోల పరచడం లేదు. మన సాంఘిక నియమాలే మన బ్యాంకింగ్ వ్యవస్థను సాంప్రదాయ ధోరణిలో నడిచేట్లు చేశాయి. అడ్డగోలుగా ఋణాలిచ్చి, కట్టుదప్పి ఖర్చు పెట్టించిన దేశాలు దీనావస్థకు చేరాయి. వలసవాదంతో యితరదేశాలను బానిసలను చేసుకున్న దేశాలు సామ్రాజ్యాలు కోల్పోయి, అప్పుల వూబిలో అల్లాడుతున్నాయి.
సమాజపరంగా చూసినా కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమై, అలజడితో, ఆందోళనలతో జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్న వారు పెరిగిపోయారు. మన దేశాన్ని యీ మాత్రంగా నైనా నిలిపి వుంచినది మనం కాపాడుకునే మానవీయ విలువలు. రామాయణ, భారత, భాగవతాల ద్వారా మనం నేర్చిన నైతికనియమాలు. వాటిని చెదిరిపోకుండా కాపాడు కోవలసిన బాధ్యత మీ తరంపై వుంది. యోగాభ్యాసం శారీరకమైన కసరత్తు మాత్రమే కాదు, మెదడుని చురుగ్గా ఉంటే ప్రక్రియ మాత్రమే కాదు, దానిలో భాగమైన ధ్యానం మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.’
17 ఏళ్ల క్రితం ధృవ కాలేజీ విద్యార్థుల నుద్దేశించి చేసిన ప్రసంగపాఠమిది. అప్పటికంటె యిప్పుడు కాలుష్యం మరింత పెరిగింది. వాయుకాలుష్యమే కాదు, శబ్ద కాలుష్యమూ పెరిగింది. ప్రాణాయామమే కాదు, ధ్యానమూ అత్యవసరమైంది. నాలుగేళ్ల క్రితం కరోనా శ్వాసావయవాలను ఓ కుదుపు కుదిపింది. అంతేకాదు, ఉద్యోగస్తులను ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ పేరుతో యింట్లో కూర్చోబెట్టి వారి జీర్ణవ్యవస్థను చెడగొట్టి, రుమాటిజమ్‌ను పెంచింది. అప్పటికంటె యోగాభ్యాస అవసరం యిప్పుడు మరింతగా పెరిగింది.
– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
Need of the hour article, Sir.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Reducing imbalances such as Vaata, Pitta, Kapha is he key, well said.
ఆవిడ ఎవరో. మీలాగే చెప్పారు సార్..అమ్మాయిలని జైల్ లవ్ వేసి చదివిస్తున్నారు. వాళ్ళకి హెల్త్ problems వస్తున్నాయి అని ఆవిడ గొంతు నొప్పి తప్ప ఏం ఉపయోగం లేదు సార్.. పేరెంట్స్ కి బుద్ధి లేదు..