ఓటీటీ వాచ్ : ‘ప‌ని’ క్రిమిన‌ల్స్ ఎమోష‌న‌ల్ స్టోరీ!

జోసెఫ్, నాయ‌ట్, ఇర‌ట వంటి సినిమాల‌తో ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు అయిన జోజూ జార్జ్ తొలి ద‌ర్శ‌కుడిగా మారి తీసిన సినిమా ‘ప‌ని’. ప‌ని అంటే తెలుగులో లాగే మ‌ల‌యాళంలో కూడా వ‌ర్క్ అనే…

జోసెఫ్, నాయ‌ట్, ఇర‌ట వంటి సినిమాల‌తో ఓటీటీ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడు అయిన జోజూ జార్జ్ తొలి ద‌ర్శ‌కుడిగా మారి తీసిన సినిమా ‘ప‌ని’. ప‌ని అంటే తెలుగులో లాగే మ‌ల‌యాళంలో కూడా వ‌ర్క్ అనే అర్థ‌మే వ‌స్తుంది.

థియేట‌రిక‌ల్ రిలీజ్ లో ఈ సినిమా మ‌ల‌యాళంలో బాగానే ఆడింది. దీన్ని తెలుగులోకి కూడా అప్పుడే అనువ‌దించారు. అయితే క‌నీస ప్ర‌చారం కూడా లేక‌పోవ‌డంతో ఈ సినిమా తెలుగులో థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ట్టుగా కూడా లేదు. సోనీ లైవ్ లో ఈ విడుద‌లైన ప‌ని సినిమాతో జోజూ ఎక్క‌డా నిరాశ‌ప‌ర‌చ‌డు.

జోసెఫ్‌, ఇర‌ట వంటి సినిమాలు చూస్తే జోజూ సినిమాలు ఎలా ఉంటాయో ఒక అంచ‌నాకు రావొచ్చు. విని కూడా త‌ట్టుకోలేనంత హార్ష్ క్రైమ్ స్టోరీలు అత‌డి క‌థాంశాలు.

త‌న పాత్ర వ‌ర‌కూ త‌ను చేసింది ఎలాంటి పాత్ర అయినా దాని మీద జాలిని సృష్టించుకోగ‌ల రీతిలో అత‌డి సినిమాల స్క్రిప్ట్ లుంటాయి. ఇర‌ట‌లో అత‌డు అత్యంత క్రూర‌మైన పాత్ర‌నొక‌దాన్ని చేశాడు. ఆ పాత్ర‌కు త‌నే విధించుకునే శిక్ష‌తో ఆ సినిమా సాగుతుంది.

ఆంటోనీ అంటూ మ‌రో సినిమా ఉంటుంది. సెటిల్ మెంట్లు, రౌడీయిజం చేసే ఒక లోక‌ల్ రౌడీ త‌ను హ‌త్య చేసిన ఒక కుటుంబం బాధ్య‌త‌లు తీసుకోవ‌డంతో సాగే సినిమా. అది ఎప్పుడో ‘రౌడీ బాబాయ్’ నాటి క‌థే అయినా, దాన్ని ట్రీట్ చేసి న తీరు మాత్రం హ‌త్తుకుంటుంది. క్రైమ్ చుట్టూ సాగే ఎమోష‌న్ల‌తో జోజూ సినిమాలు వీక్షింప‌జేస్తాయి.

ఆ వ‌ర‌స‌లోని సినిమానే ప‌ని కూడా. ఆంటోనీ సినిమాలో త‌ను చేసిన పాత్ర‌కు మించిన లోక‌ల్ డాన్ పాత్ర‌ను చేశాడు జోజూ. అత‌డు, అత‌డి స్నేహితులు యూనిటీగా త్రిశూర్ లో సెటిల్ మెంట్లు, పంచాయ‌తీలు సాగిస్తూ ఉంటారు. గాడ్ ఫాద‌ర్ త‌ర‌హా పాత్ర‌లవ‌న్నీ. వీరిపై పోలీసుల క‌న్ను కూడా ఉంటుంది. అయితే గాడ్ ఫాద‌ర్ స్థాయి వ్య‌క్తులు కావ‌డంతో వీరి జోలికి వారు కూడా తేలిక‌గా వెళ్ల‌లేరు.

అయితే వీరికి చుక్క‌లు చూపిస్తారు ఇద్ద‌రు క‌ర్క‌శ‌మైన కుర్రాళ్లు. వీరిని చూసే ఆద‌ర్శంగా హ‌త్య‌లు చేయ‌డం మొద‌లుపెట్టే ఆ కిరాత‌కులు ఈ లోక‌ల్ డాన్ల‌ను ఆటాడుకుంటారు. పోలీసులు కూడా క‌న్నెత్తి చూడ‌టానికి కాసేపు ఆలోచించే సిటీ గాడ్ ఫాద‌ర్ల‌కు ఇద్ద‌రే ఇద్ద‌రు క‌ర్క‌శ‌మైన కుర్రాళ్లు చూపించే క‌ష్టాలే సినిమా. వారిని ప‌ట్టుకోవ‌డానికి, ఆట‌క‌ట్టించ‌డానికి జోజూ గ్యాంగ్ వేసే ఎత్తులు, తెగించిన ఆ కుర్రాళ్లు వాటిని ఎదుర్కొనే తీరు.. ప‌చ్చి నెత్తురుతో రాసిన‌ట్టుగా సాగే క‌థ ఇది.

సున్నిత మ‌న‌స్కులు ఈ సినిమా జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. ప్ర‌తి సినిమాతోనూ జోజూ హింస డోసును పెంచుకుంటూ పోతున్నాడు. వార్తా ప‌త్రిక‌ల్లో చూసే క్రైమ్ స్టోరీల‌కు మించిన స్థాయిలో ఇత‌డి సినిమా క‌థ‌లుంటున్నాయి.

ద‌ర్శకుడిగా జోజూ మ‌రింత హింసాత్మ‌క క‌థ‌నే ఎంచుకున్నా.. ఎక్క‌డా త‌డ‌బాటు అయితే లేదు. ఎక్క‌డా త‌గ్గ‌కుండా ప్రారంభం నుంచి, ఆఖ‌రి వ‌ర‌కూ వీక్షింప‌జేసే క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ప‌ని’.

7 Replies to “ఓటీటీ వాచ్ : ‘ప‌ని’ క్రిమిన‌ల్స్ ఎమోష‌న‌ల్ స్టోరీ!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. జోజూ జార్జ్ చేసిన సినిమాల్లో నాయాట్ట్ ఒక్కటే కాస్త డిఫరెంట్ మూవీ.

    ఇటువంటి సినిమాలు తప్ప వేరే జానర్ సినిమాలు చేయలేడా అతను?

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.