మార్చి 28.. నిజానికి ఈ డేట్ ఇద్దరిది. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో పాటు, విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమాకు కూడా ఇదే తేదీని ప్రకటించారు. ఆశ్చర్యంగా ఇప్పుడీ తేదీ నుంచి ఈ రెండు సినిమాలు తప్పుకున్నాయి.
హరిహర వీరమల్లు వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. ఆ సినిమా రాదనే సమాచారంతోనే రాబిన్ హుడ్ ను ఆ తేదీకి దించుతున్నారనేది బహిరంగ రహస్యం. మరి పవన్ రానప్పుడు, విజయ్ దేవరకొండ సినిమాను ఆ తేదీకి తీసుకురావొచ్చు కదా.
ఆశ్చర్యంగా విజయ్ దేవరకొండ సినిమాను కూడా ఆ డేట్ నుంచి తప్పించారు. మార్చి 28న కాకుండా, 2 నెలలు ఆలస్యంగా మే చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ముందుగా ప్రకటించిన 2 సినిమాలూ ఆ తేదీ నుంచి తప్పుకున్నట్టవుతుంది.
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా స్థానంలో, మ్యాడ్ స్క్వేర్ సినిమాను షెడ్యూల్ చేసింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. నిజానికి రేసులో మ్యాడే స్క్వేర్ లేనే లేదు.
హరిహర వీరమల్లు రాకపోతే మాత్రం తమ సినిమాను కచ్చితంగా విడుదల చేస్తామని, పవన్ సినిమా వస్తే, తమ సినిమాను తప్పిస్తామని ఆమధ్య నాగవంశీ విస్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు పవన్ సినిమా రాదని క్లారిటీ వచ్చినప్పటికీ, విజయ్ దేవరకొండ సినిమాను తప్పించారు. ఓటీటీ సంస్థతో కుదుర్చున్న ఒప్పందంలో భాగంగా ఈ సినిమాను 2 నెలలు ఆలస్యంగా థియేటర్లలోకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ