దగ్గుబాటి కాంపౌండ్ లో ఓ కథకు గ్రీన్ సిగ్నల్ పడాలంటే ఎన్నో వడపోత కార్యక్రమాలుంటాయి. మరీ ముఖ్యంగా సురేష్ బాబు అడిగే లాజిక్స్ కు, ప్రశ్నలకు సరైన సమాధానాలుండాలి. మార్కెట్ పై పూర్తి అవగాహన కల్గి ఉండాలి. అందుకే చాలామంది దర్శకులు వెంకటేష్ కు కథలు చెప్పారు కానీ, సినిమాలు మాత్రం తీయలేక వెనుదిరిగారు.
అలాంటి కాంపౌండ్ లో దర్శకుడు అనీల్ రావిపూడికి ఓపెన్ ఆఫర్ దక్కింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ రెడీ చేస్తే, ఎలాంటి ప్రశ్నలు అడక్కుండా కాల్షీట్లు ఇస్తామనేది ఆ ఓపెన్ ఆఫర్. వెంకటేష్ వరకు చూసుకుంటే పెద్ద ఆఫర్ ఇది.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పెద్ద హిట్టయింది. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి సినిమాల్లో క్లియర్ విన్నర్ ఇదే. అటు యూఎస్ లో కూడా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు వెంకీ.
ప్రేక్షకుల తీర్పు క్లియర్ గా ఉంది. తనను ఎలాంటి పాత్రలో, కథలో ఆడియన్స్ చూడాలనుకుంటున్నారో వెంకీకి పూర్తి క్లారిటీ వచ్చింది. దీంతో అనీల్ రావిపూడికి ఓపెన్ ఆఫర్ దక్కింది.
అనీల్ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ పై పరోక్షంగా ప్రకటన చేశాడు. సీక్వెల్ తీస్తే దాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తామన్నాడు. కథ ముగించిన రాజమండ్రి నుంచే సీక్వెల్ మొదలుపెడతానని కూడా అన్నాడు. సో.. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమిక.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
Hi