పవన్ కల్యాణ్ పై తొలి అవినీతి ఆరోపణ?

ఎకరం కోటి రూపాయలు పలికే భూమిని, కేవలం 15 లక్షల రూపాయల చొప్పున 1200 ఎకరాలు అప్పగిస్తున్నారని విమర్శిస్తోంది.

పార్టీ పెట్టి దశాబ్దమైంది. తొలిసారి అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు 7 నెలలు అవుతోంది. ఇన్ని నెలల్లో ఎప్పుడూ పవన్ కల్యాణ్ పై అవినీతి ఆరోపణలు రాలేదు. ఆ మాటకొస్తే, చాలామంది ఆయన్ను ఆ కోణంలో చూడలేదు కూడా.

అధికారంలోకి వచ్చినప్పట్నుంచి పవన్ కల్యాణ్ పరిపాలన డిఫరెంట్ గా సాగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, మరోవైపు ప్రాయశ్చిత్త దీక్షలు, ఇంకోవైపు చంద్రబాబుతో క్యాబినెట్ భేటీలు, మధ్యలో ఓసారి ఢిల్లీ టూర్.. ఇలా గడుపుతూ వస్తున్నారు. అయితే తొలిసారి ఆయనపై అవినీతి విమర్శలు ఎక్కుబెట్టింది వైసీపీ. దీనికి కారణం టీజీ విశ్వప్రసాద్.

ఓర్వకల్లులో ఈ-మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ కంపెనీకి 1200 ఎకరాలు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కు చెందిన కంపెనీ ఇది. పవన్ కల్యాణ్ కు, విశ్వప్రసాద్ కు మంచి అనుబంధం ఉంది. పవన్ హీరోగా విశ్వప్రసాద్ సినిమా నిర్మించారు. ఎన్నికల టైమ్ లో పవన్ కు ఫండింగ్ కూడా ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో పీపుల్ టెక్ కు వందల ఎకరాల భూమి కేటాయించడంపై వైసీపీ ప్రశ్నిస్తోంది. డిప్యూటీ సీఎంకు విశ్వప్రసాద్ స్నేహితుడు కావడం వల్లనే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా అప్పగించారని అంటోంది. ఎకరం కోటి రూపాయలు పలికే భూమిని, కేవలం 15 లక్షల రూపాయల చొప్పున 1200 ఎకరాలు అప్పగిస్తున్నారని విమర్శిస్తోంది.

“ఈ చవట ప్రభుత్వం ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేదు కానీ తాబేదారులకు వందల ఎకరాల భూములు కట్టబెడుతోంది. పవన్ కల్యాణ్ సినిమా పార్ట్నర్ అయిన విశ్వ ప్రసాద్ కంపెనీకి 1,200 ఎకరాలు కేటాయించారు. అందులో యువతకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారో ఈ దొంగ పార్ట్నర్లు.” అంటూ ఘాటుగా స్పందించింది.

నిజానికి పవన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. ఆయన అధికారంలోకి రాకముందు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు పవన్ పై ఇదే తరహా ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీ డబ్బులే, బ్రో సినిమా రెమ్యూనరేషన్ కింద, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేతుల మీదుగా పవన్ కల్యాణ్ కు అందిందంటూ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై వైసీపీ అవినీతి ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి.

28 Replies to “పవన్ కల్యాణ్ పై తొలి అవినీతి ఆరోపణ?”

  1. Development కి land ఇవ్వడం…..వూరికే దోచుకు తినడానికి ,అప్పనంగా అమ్ముకోవడానికి వేల యేకరాల govt land కొట్టేయడం ఒక్కటేనా GA….ఐన pawan kalyan లాంటి నిజాయితీ గల వ్యక్తి మీద బురద చల్లడం అంటే…ఆకాశం వైపు వుమ్మి వేసినట్టే GA…

  2. షిరిడీ saayi electricals ku adhani ku కలిపి సుమారు వేల కోట్ల తొ ఎలాంటి బిడ్డింగ్ లేకుంట మీటర్లు కాంట్రాక్టు లు ఇచ్చారు ఆ రోజున మా సార్.అది లెక్క

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. Package dabbulu remuneration ga ichunte TG ki labs ivvalsina panem leduga. Ante appudu abaddam chepparu leda ippudu abaddam cheptunnaru. Or rendu sarlu abaddam cheptunnaru.

    Oka pani cheyyandi aa price ki meere teeskondi leda meere oka industrialist ni teeskochi aa price ippinchandi. Appudu mee aropanalu nammutam.

  5. ఒక్క ఇండస్ట్రీ ఇంత వరుకూ పెట్టలేదు.. ఇండస్ట్రీస్ పెట్టిన అనుభవం లేదు.. పోనీ ఇండస్ట్రీ పెట్టి, సక్సెస్ఫుల్ గ రన్ చేసిన వాళ్ళతో టై అప్ లేదు.. పైడ్ అప్ కాపిటల్ లేదు… ఎం లేదు..

    .

    .

    .

    ఊరికే ఇవ్వరు ఎకరాలు.. 1200 ఎకరాలు

    ఎందుకు ఇచ్చారు.. ? ఎం తెలుసనీ ఇచ్చారు.. …..కోట్లు ఖర్చు పెట్టి పార్టీ లు ఇవ్వడం తెలుసు…

    .

    పార్టీ కి ఫండ్ ఇవ్వడం తెలుసు…

  6. ఇటువైపు ఒక స్కాం స్టార్ట్ అయితే.. మన గొర్రె పప్పా తక్కువా… అని అక్కడ ఇంకో స్కాం కి రెడీ చేసాడు..

    కంపెనీ నే పెట్టలేదు… కానీ 14000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అట.. ఇప్పటి వరుకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు.. గానీ, ఇప్పుడు బోలెడు జాబ్స్ ఇచ్చేస్తారు అట…

    మొన్న ఎర్రి పప్పా జైలు కి ఎల్లాడు.. ఈసారి గొర్రె పప్పా ఎల్తాడేమో

  7. ఇటువైపు ఒక స్కాం స్టార్ట్ అయితే.. మన గొర్రె పప్పా తక్కువా… అని అక్కడ ఇంకో స్కాం కి రెడీ చేసాడు..

    కంపెనీ నే పెట్టలేదు… కానీ 14000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు అట.. ఇప్పటి వరుకు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు.. గానీ, ఇప్పుడు బోలెడు జాబ్స్ ఇచ్చేస్తారు అట…

  8. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  9. అదే మా బోకు గాడైతే ఏ పదవి లేక పోయినా ఏకంగా 43000 కోట్లు దొబ్బేసాడు, అది మా రేంజ్ – వైచీపీ fan

  10. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటివి కోకొల్లలు లేరా గ్యాస్ ఆంధ్ర. చంద్రబాబు మీద స్టిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు కదా ఇది కూడా ఆ బాబతే.

    ఎందుకంటే అన్న ఏం చేసినా మనకు కనపడదు వినపడదు. ఇతరులు ఏం చేసినా మనకు కనిపిస్తుంది వినిపిస్తుంది అదే కదా గ్యాస్ ఆంధ్ర స్పెషాలిటీ. అన్న అధికారంలో ఉన్నంతవరకు మనము కళ్ళు ఉన్న కబోధులను చెవులున్న చెవిటి వాళ్ళం. ఎందుకంటే నువ్వు, టెన్ టీవీ,, ఎన్టీవీ, టీవీ9

    ఆంధ్ర సమాచారం మిగిలిన వాళ్లంతా జగన్కు అమ్ముడుపోయారు కదా . అమ్ముడుపోయిన బానిసకు మాట్లాడే హక్కు ఉండదు కదా .

Comments are closed.