అబ్బే…స‌మ‌స్య‌లే లేవన్న కొలిక‌పూడి!

త‌న‌పై వ‌చ్చిన అన్ని ర‌కాల ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ‌గా ఒక నోట్‌ను క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి ఇచ్చిన‌ట్టు కొలిక‌పూడి తెలిపారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి స‌మ‌స్య‌లూ లేవ‌ని, వుంటే మీరే చెప్పాల‌ని మీడియా ప్ర‌తినిధుల్ని తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. గిరిజ‌న మ‌హిళ ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి కార‌ణం కావ‌డంతో పాటు సొంత పార్టీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేలా న‌డుచుకుంటూ, ప‌దేప‌దే వివాదాస్ప‌దం ఎందుకు అవుతున్నారో వివ‌ర‌ణ కోసం టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడిని శ్రీ‌నివాస్‌ను ఇవాళ పిలిచింది.

కొలిక‌పూడి వెళ్లారు, వ‌చ్చారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గోపాల‌పురం గ్రామంలో ఎస్టీ మ‌హిళ ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి తానే మాత్రం కార‌ణం కానే కాద‌ని క‌మిటీ ముందు చెప్పాన‌న్నారు. అలాగే త‌న‌పై వ‌చ్చిన అన్ని ర‌కాల ఆరోప‌ణ‌ల‌కు వివ‌ర‌ణ‌గా ఒక నోట్‌ను క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీకి ఇచ్చిన‌ట్టు కొలిక‌పూడి తెలిపారు.

గుడితో పాటు ఒక ఇంజ‌నీరింగ్ కాలేజీ ఎదురుగా మ‌ద్యం దుకాణం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వుండ‌డంతో తొల‌గించాల‌ని కోరాన‌న్నారు. త‌న విజ్ఞ‌ప్తి మేర‌కు ఊరి బ‌య‌ట పెట్టుకునేందుకు వాళ్లు ముందుకొచ్చార‌న్నారు. అలాగే ఒక వీఆర్వో కుటుంబం త‌న వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్టు ఆరోప‌ణ‌లు వచ్చాయ‌న్నారు. ఇప్పుడా వీఆర్వో కుటుంబం త‌న వెంటే వుంద‌న్నారు. అస‌లు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వివాదాలేవీ లేవ‌ని ఆయ‌న అన్నారు.

తానిచ్చిన వివ‌ర‌ణ మేర‌కు సీఎం చంద్ర‌బాబుకు నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని క‌మిటీ చెప్పింద‌న్నారు. క‌మిటీ వ‌ద్ద అన్నింటిని వివ‌రించిన‌ట్టు ఆయ‌న అన్నారు.

8 Replies to “అబ్బే…స‌మ‌స్య‌లే లేవన్న కొలిక‌పూడి!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. ఇదీ ప్రతీ పార్టీలో ఉండాల్సిన అంతర్గత ప్రజాస్వామ్యం అంటే..

    మావోడూ ఉన్నాడు.. మంత్రులు గంటా అరగంటా వస్తావా అని వేధించినా నో విచారణ

    MLAలు సంధ్యా సుకన్యా ఇంకేమీ చెయ్యరా అని బ్లాక్మెయిల్ చేసినా నో విచారణ

    ఎంపీ లు బట్టలుప్పి ప్యాలెస్ లేడీస్ కి ‘న్యూడ్ వీడియో కాల్స్ చేసి

    ‘బ్లూ సినిమా చూపించినా NO విచారణ

    1. నిజమే టీడీపీ ని చాల బాగ రన్ చేస్తున్నారు అంత ఎన్టీఆర్ నేర్పిన క్రమ శిక్షణ

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.