ఆర్భాటాలు.. ఐటీ దాడులు

ఫ్యాన్స్ కోసం, సినిమా ను మరింత ముందుకు నడిపించడం కోసం ఈ పోస్టర్ల పబ్లిసిటీ అన్నది కామన్ అయిపోయింది. కానీ అదే పీకల మీదకు తెస్తోంది.

పుష్ప 2 ప్రీ రిలీజ్ వేదిక మీద యాంకర్ సుమ నోట ఒకటే మాట. “సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్ చేసిన సినిమా” అంటూ. అప్పట్లోనే అక్కడున్న సినిమా జనాలు గుసగుసలాడుకున్నారు. “ఆదాయ పన్ను శాఖ వారిని రా.. రమ్మని పిలుస్తున్నట్లుంది ఆమె అనౌన్స్‌మెంట్” అని. నిర్మాతలకు అలా అనౌన్స్ చేయడం ఇష్టం లేదు. కానీ హీరో ఒత్తిడి మేరకు అలా చెప్పించక తప్పలేదు.

సినిమా విడుదల తరువాత ఏ మేరకు హిట్ అయ్యాయి అన్నది పక్కన పెడితే, కలెక్షన్ల పోస్టర్ల హడావుడి మొదలవుతుంది. “డైలీ అప్‌డేట్” అంటూ పోస్టర్ల మీద పోస్టర్లు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ. దీంతో ఆదాయపన్ను శాఖ, జీఎస్టీ దృష్టిని ఆకర్షించడం తప్ప వేరు వుండదు.

ఫ్యాన్స్ కోసం, సినిమా ను మరింత ముందుకు నడిపించడం కోసం ఈ పోస్టర్ల పబ్లిసిటీ అన్నది కామన్ అయిపోయింది. కానీ అదే పీకల మీదకు తెస్తోంది. అంతే కాదు, నిర్మాతలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కూడా ఆదాయపన్ను శాఖ సీరియస్‌గా తీసుకుంటోంది.

ఇప్పుడు అదే జరుగుతోంది. దాదాపు వంద మంది ఆదాయపన్ను బృందాలు టాలీవుడ్ ఇండస్ట్రీ మీదకు దాడికి దిగాయి. పుష్ప 2 తీసిన మైత్రీ సంస్థ మీద, సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీసిన దిల్ రాజు సంస్థల మీద, వాటితో అనుబంధం వున్న మ్యాంగో మీడియా మీద ఈ ఉదయం నుంచి దాడులు మొదలయ్యాయి. ఇవి కనీసం నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని తెలుస్తోంది.

5 Replies to “ఆర్భాటాలు.. ఐటీ దాడులు”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.