తిరుప‌తి ఎస్పీపై వేటు ఉత్తుత్తిదే!

తిరుప‌తి దుర్ఘ‌ట‌న జ‌రిగి రెండు వారాలు కూడా గ‌డ‌వ‌క‌నే, దానికి ప్ర‌ధాన బాధ్యుడైన తిరుప‌తి ఎస్పీకి పోస్టు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌భుత్వం ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్న‌దో పాల‌కుల‌కే తెలియాలి.

తిరుమ‌ల శ్రీ‌వారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి టోకెన్ల జారీ సంద‌ర్భంగా తొక్కిస‌లాట‌లో ఆరుగురి ప్రాణాలు పోవ‌డానికి బాధ్యుడిని చేస్తూ తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడిపై బ‌దిలీ వేటు వేసిన‌ట్టు ప్ర‌భుత్వం ఆర్భాటంగా ప్ర‌క‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తిరుప‌తి ఎస్పీపై వేటు ఉత్తుత్తిదే అని తేలిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఇటీవ‌ల తిరుప‌తి తొక్కిస‌లాట‌కు బాధ్యుడిని చేస్తూ, ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు, జేఈవో గౌత‌మిపై బ‌దిలీ వేటు వేశారు.

తెలంగాణ నుంచి డెప్యుటేష‌న్‌పై సుబ్బ‌రాయుడిని చంద్ర‌బాబు ఏరికోరి మ‌రీ తెచ్చుకున్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో తిరుప‌తి ఎస్పీ స్థానం నుంచి బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింది. అయితే తాజా బ‌దిలీల్లో తిరిగి సుబ్బ‌రాయుడు తిరుప‌తిలోనే వుండేలా పోస్టింగ్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తిరుప‌తి ఎర్ర‌చంద‌నం టాస్క్‌ఫోర్సు ఎస్పీగా సుబ్బ‌రాయుడిని తాజా బ‌దిలీల్లో నియ‌మించ‌డం విశేషం.

కానీ టీటీడీ జేఈవో గౌత‌మికి మాత్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వ‌లేదు. గౌత‌మిపై ప్ర‌భుత్వం క‌క్ష‌తోనే పోస్టింగ్ ఇవ్వ‌లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఒకే త‌ప్పుపై ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల్ని బ‌దిలీ చేసిన‌ప్పుడు… తాము కోరి తెలంగాణ నుంచి తెచ్చుకున్న సుబ్బ‌రాయుడికి మాత్రం అదే తిరుప‌తిలో ఉద్యోగ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డాన్ని ఎలా చూడాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. త‌ప్పొప్పుల‌తో సంబంధం లేకుండా, మ‌నోడా? కాదా? అనే ప్రాతిప‌దిక‌న ఈ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నేందుకు సుబ్బ‌రాయుడికి పోస్టింగ్ ఇవ్వ‌డాన్ని ఉదాహ‌ర‌న‌గా ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు చూపుతున్నారు.

తిరుప‌తి దుర్ఘ‌ట‌న జ‌రిగి రెండు వారాలు కూడా గ‌డ‌వ‌క‌నే, దానికి ప్ర‌ధాన బాధ్యుడైన తిరుప‌తి ఎస్పీకి పోస్టు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌భుత్వం ఎలాంటి సంకేతాలు పంపాల‌ని అనుకుంటున్న‌దో పాల‌కుల‌కే తెలియాలి. చివ‌రికి ఉన్న‌త ఉద్యోగుల్ని కూడా కులాల ప్రాతిప‌దిక‌న వేరు చేసి, పోస్టింగ్‌లు ఇస్తోంద‌నే చెడ్డ‌పేరును ఈ ప్ర‌భుత్వం మూట‌క‌ట్టుకుంటోంద‌ని గ్ర‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

3 Replies to “తిరుప‌తి ఎస్పీపై వేటు ఉత్తుత్తిదే!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. సుబ్బారాయుడిని తీసేసిన రోజేమో బలిజ కులం అధికారిని బలి చేశారని, కుల తత్వం అని రాసావు. ఇప్పుడేమో స్వంత మనిషికి మంచి పోస్టింగ్ ఇచ్చుకున్నాడని రాసావు. అన్నీ మాటలు నీవే.

Comments are closed.