45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?

రాజకీయ నాయకులు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థంకాదు. సంచలన కామెంట్స్ చేస్తుంటారు. కానీ వాటికి ఆధారాలు ఉండవు.

రాజకీయ నాయకులు ఒక్కోసారి ఏం మాట్లాడతారో అర్థంకాదు. సంచలన కామెంట్స్ చేస్తుంటారు. కానీ వాటికి ఆధారాలు ఉండవు. ఏదో ఒక విషయం చెబుతారు. కానీ అది ఎలా జరుగుతుందో చెప్పరు. కామెంట్ చేసి ఊరుకుంటారు.

ఇక అలా ఎందుకన్నారన్నది జనాలు జుట్టు పీక్కోవాలి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఒక సంచలన కామెంట్ చేశారు. ఇంతకూ ఆయన ఏమన్నారు అంటే.. తెలంగాణలో 45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వస్తుందట. పైగా ఇది పక్కా రాసి పెట్టుకోండి అన్నారు.

ఈ మాట అన్నది ఆంధ్రలోని భీమవరంలో. అక్కడ కృష్ణంరాజు జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ తెలంగాణలో 45 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం వస్తుందని, ఇది పక్కా అని అన్నారు.

అంతే.. ఇంకేం చెప్పలేదు. ఆ పార్టీకి ఉన్నది ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు. మరి బీజేపీ సర్కారు ఎలా ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుందో ఆయన వివరించలేదు. ఆధారాలు ఏమిటో చెప్పలేదు. ఆయన ఎందుకు ఇలా మాట్లాడాడు? ఏమో …ఆయనకే తెలియాలి.

6 Replies to “45 రోజుల్లో బీజేపీ ప్రభుత్వమా?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు,. మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. వారం రోజుల్లో రాహుల్ గాంధి ప్రధాన మంత్రి అవుతున్నారు అది కూడా స్వయంగా అమిత్ షా చెప్పాడు , అంతే కాకుండా బీజేపీ లో అవినీతి , అక్రమాలు కూడా ఎక్కువయ్యాయని ఉద్ఘాటించారు

Comments are closed.