జ‌న‌సేన కార్యాల‌యంపై డ్రోన్‌.. మ‌రిన్ని అనుమానాలు!

జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంపై డ్రోన్ ఎగ‌ర‌డం రాజ‌కీయంగా వివాదాస్ప‌ద‌మైంది.

జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంపై డ్రోన్ ఎగ‌ర‌డం రాజ‌కీయంగా వివాదాస్ప‌ద‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా పోలీసు అధికారి ఇచ్చిన వివ‌ర‌ణ మ‌రిన్ని అనుమానాల‌కు చోటు ఇచ్చిన‌ట్టైంది. జ‌న‌సేన కార్యాల‌యంపై డ్రోన్ ఎగ‌ర‌డాన్ని జ‌న‌సేన సీరియ‌స్‌గా తీసుకుంది. అస‌లే ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌ద్ర‌త‌పై జ‌న‌సేన భ‌యాందోళ‌న‌లో వుంది. ఈ నేప‌థ్యంలో డ్రోన్ ఎగ‌ర‌డం ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న‌ను మ‌రింత పెంచింది.

జ‌న‌సేన ఫిర్యాదు మేర‌కు పోలీస్‌శాఖ సీరియ‌స్‌గా విచార‌ణ చేప‌ట్టింది. రెండురోజుల్లోనే దీని వెనుక ప్ర‌భుత్వం వుంద‌ని తేల్చేసింది. ఆ డ్రోన్ ఏపీ పైబ‌ర్‌నెట్ సంస్థ‌ద‌ని తేల్చేసింది. ట్రాఫిక్‌, పారిశుధ్య కాల్వ‌ల నిర్వ‌హ‌ణ‌, ర‌హ‌దారులు ఎలా ఉన్నాయ్‌? త‌దిత‌ర అంశాల‌పై అధ్య‌య‌నం కోసం ఫైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో డ్రోన్ల‌తో స‌ర్వే చేస్తున్న‌ట్టు పోలీస్‌శాఖ ప్ర‌క‌టించింది.

ఇక్క‌డే జ‌న‌సేన‌లోనూ, జ‌నంలోనూ అనుమానాల్ని పెంచ‌డానికి వివ‌ర‌ణ ఊతం ఇచ్చింది. ఎందుకంటే, జ‌న‌సేన‌ కార్యాల‌యంపై ఎవ‌రో డ్రోన్ ఎగురేశార‌ని, ఎంత‌టి వారైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జ‌న‌సేన డిమాండ్ చేస్తున్న‌ప్పుడు… వెంట‌నే పైబ‌ర్‌నెట్ సంస్థ ప్ర‌తినిధులు ముందుకొచ్చి, ఆ ప‌ని చేసింది తామే అని ఎందుకు ప్ర‌క‌టించ‌లేదు? ప్ర‌భుత్వం మంచి ప‌ని కోసం డ్రోన్ల‌ను వినియోగిస్తున్న‌ప్పుడు ఇక ఆ విష‌య‌మై లోతుగా విచార‌ణ చేయాల్సిన ప‌ని ఏంటి? జ‌న‌సేన కార్యాల‌యంపైకి డ్రోన్‌ను పంపి ఎలాంటి స‌మాచారం సేక‌రించాల‌ని అనుకున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చాయి.

టీడీపీ ఏదో చేయాల‌ని అనుకుని, ఇప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌డంతో అధ్య‌య‌నం కోస‌మంటూ మాట మార్చింద‌ని జ‌న‌సేన నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదేదో విచార‌ణ జ‌ర‌గ‌డానికి ముందే, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించి వుంటే చిత్త‌శుద్ధి చాటుకున్న‌ట్టు అయ్యేద‌నేది జ‌న‌సేన వాద‌న‌. మిత్ర‌ప‌క్ష‌మైన త‌మ‌పై టీడీపీ నిఘా వుంచింద‌ని డ్రోన్ తిప్ప‌డం ద్వారా అర్థ‌మ‌వుతోంద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు.

7 Replies to “జ‌న‌సేన కార్యాల‌యంపై డ్రోన్‌.. మ‌రిన్ని అనుమానాలు!”

  1. ఆంధ్ర ప్రదేశ్ జనాలు కూటమి కి ఓట్లు వేసింది,,, పార్టీ ల మధ్య గొడవలకు కాదని కూటమి గుర్తు పెట్టుకుంటే మంచిది…

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.