మీనాక్షి చౌదరి ఫస్ట్ లవ్ ముచ్చట్లు

కాలేజీ లైఫ్ లో ఎలాంటి లవ్ లేదు. చదువుతోనే సరిపోయింది. పైగా మెడికల్ కాలేజీ కదా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది.

కెరీర్ స్టార్ట్ చేసిన ప్రారంభంలోనే మీనాక్షి చౌదరిపై పుకార్లు వచ్చాయి. ఆమె ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందని, త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం జరిగింది. దీన్ని వెంటనే ఆమె ఖండించింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలే అని ప్రకటించింది.

అయితే మీనాక్షి లైఫ్ లో లవ్ లేదా? దీనికి ఆమె సమాధానం చెప్పింది. తన జీవితంలో కూడా తొలిప్రేమ ఉందంటోంది మీనాక్షి. తన ఫస్ట్ క్రష్ ముచ్చట్లు బయటపెట్టింది.

“స్కూల్ లేదా కాలేజీలో స్టూడెంట్స్ కు కచ్చితంగా టీచర్లపై క్రష్ ఉంటుంది. నాక్కూడా అలాంటిదే ఉంది. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా క్లాస్ లో ఓ టీచర్ అంటే చాలా ఇష్టం. టోటల్ క్లాస్ మొత్తం అతడ్ని ఇష్టపడేది. నాకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. అదే నా ఫస్ట్ క్రష్ అండ్ లవ్.”

అయితే ఆ తర్వాత మళ్లీ ప్రేమలో పడేంత టైమ్ తనకు దొరకలేదంటోంది మీనాక్షి. మరీ ముఖ్యంగా మెడిసిన్ చదువు వల్ల ప్రేమకు పూర్తిగా దూరమయ్యానని చెబుతోంది.

“కాలేజీ లైఫ్ లో ఎలాంటి లవ్ లేదు. చదువుతోనే సరిపోయింది. పైగా మెడికల్ కాలేజీ కదా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. ఎప్పుడూ చదువే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నేను ఎవరి ప్రేమలో పడలేదు. కెరీర్ పై మాత్రమే ఫోకస్ పెడుతూ వస్తున్నాను.”

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సెటిల్ అవుతున్న మీనాక్షి చౌదరి, ఇప్పట్లో పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. ప్రేమకు, పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని, ప్రస్తుతానికి సినిమాలే తన లోకమని అంటోంది.

3 Replies to “మీనాక్షి చౌదరి ఫస్ట్ లవ్ ముచ్చట్లు”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.