ఆచి తూచి ఖర్చు పెట్టడం, ప్లాన్డ్ గా నిర్మాణాలు చేపట్టడం, పెద్దగా రిస్క్ లేని విధంగానే ముందుకు సాగడం అన్నది గీతా కాంపౌండ్ కు అలవాటు. తమ మెగా హీరోలు మెగాస్టార్, రామ్ చరణ్, బన్నీ వీళ్ల మీద మాత్రం భారీగా ఖర్చు చేసి సినిమాలు తీసారు. హిట్ లు కొట్టారు. కానీ మరే హీరో అయినా సినిమా తీస్తే కొలతలు, కూడికలు తీసి వేతలు అన్నీ చూసుకునే చేస్తారు. కానీ ఫస్ట్ టైమ్ ఫర్ ఏ ఛేంజ్, అస్సలు ముందు వెనుక ఆలోచించకుండా ఖర్చు చేస్తూ చేస్తున్న సినిమా తండేల్.
నాగ్ చైతన్య-సాయిపల్లవి-చందు మొండేటి ల క్రేజీ కాంబినేషన్. సముద్రం బ్యాక్ డ్రాప్. మంచి ప్రేమ కథ. అందుకే నిర్మాత బన్నీవాస్ విపరీతంగా నమ్మారు. సినిమాకు రెమ్యూనిరేషన్లే దాదాపు ముఫై కోట్ల వరకు ఖర్చు చేసారు. భారీ సిజి పనులు వున్నాయి. చాలా వర్కింగ్ డేస్ అవసరం పడ్డాయి. సినిమా సగం వరకు వస్తే తప్ప, ఖర్చు అనుకున్న గీత దగ్గర ఆగేలా లేదని అర్థం కాలేదు యూనిట్ కు. కానీ వాళ్లు కూడా ఆగలేదు. ధైర్యంగా ఖర్చు పెట్టుకుంటూనే వెళ్లారు.
నాగ్ చైతన్య మార్కెట్ సంగతి అలా వుంచితే సాయిపల్లవి క్రేజ్ ఇటు ఆఫ్ లైన్ లో, అటు ఆన్ లైన్ లో చాలా సూపర్ గా వుంది. ఇటీవల అమరన్ ఇచ్చిన జోష్. ఇంతా అంతా కాదు. అందుకే తండేల్ యూనిట్ అస్సలు వెనక్కు తగ్గలేదు. ముందుకే వెళ్లింది. అంతా బానే వుంది. ఇప్పుడు థియేటర్..నాన్ థియేటర్ కలిసి పెట్టిన బడ్జెట్ కు మ్యాచ్ అవ్వాలి. తెలుగు రాష్ట్రాల నుంచి కనీసం 35 నుంచి 40 కోట్ల మేరకు రికవరీ ఆశిస్తున్నారు.
సినిమా నుంచి ఇప్పటికి రెండు పాటలు వచ్చాయి. మిగిలినవి రావాల్సి వుంది. అలాగే ట్రైలర్ రావాలి. అప్పుడు సినిమాకు అసలు సిసలు జోష్ స్టార్ట్ అవుతుంది.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
If any movie spends less than 50% towards remuneration then you can spend rest for making quality film not telling about the story
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు