ఎవరికి ఎప్పుడు టైమ్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఎవరి టైమ్ వచ్చినపడు వాళ్ల ఆట వాళ్లు ఆడేయడం తప్ప. 2021లో అఖండ సినిమా వచ్చే వరకు నందమూరి బాలకృష్ణ కెరీర్ అరడజను ఫ్లాపులు, డిజాస్టర్లు వుంటే ఒక హిట్ పడేది. పెద్దగా రెమ్యూనిరేషన్ లేదు. సీనియర్ హీరోల్లో చిరంజీవి తరువాత అప్పటికి బాలయ్యదే ఎక్కువ. అయినా కూడా ఎనిమిది కోట్లు దాటలేదు.
“అఖండ” సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ 8 కోట్లు. దాని తరువాత “వీరసింహారెడ్డి” సినిమాకి మొదట 8 కోట్లు అనుకున్నప్పటికీ, చివరిదశలో 12 కోట్లు తీసుకున్నట్లు టాక్. ఆ తరువాత “భగవంత్ కేసరి” సినిమాకు బాలయ్య 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే, తాజాగా “ఢాకూ మహారాజ్” సినిమా కోసం 27 కోట్లతో ఒప్పందం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక “అఖండ 2” సినిమాకు బాలయ్య సుమారు 35 కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దాని తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి బాలయ్య 40 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
అంటే ఇదంతా జస్ట్ 2021 నుంచి 2025 ప్రారంభం లోగా. అంటే జస్ట్ నాలుగేళ్లలో. దీన్నే టైమ్ అంటారు. శుక్రమహాదశ అంటారు. అదృష్టం అంటారు. ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుంటారు.
సీనియర్ హీరోలు నాగ్, వెంకీ ఈ రేంజ్ కు రాలేదు. రవితేజ కూడా 30 కోట్ల లోపే వున్నారు. ఒక్క మెగాస్టార్ మాత్రమే చాలా పైన వున్నారు.
great. good for me and my country
NBK is lucky in senior stars, AA is lucky in junior stars in this…..
నీది ఏడుపు అంటారు ..