ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఒకసారి కీలకపాత్రలో జయమ్మ పంచాయతీ సినిమా చేశారు. ఆమె కెరీర్‌లో ఇది రెండో సినిమా. మళ్లీ మరే సినిమాను ఓకే చేయలేదు. ఇప్పుడు ఓ సినిమాకు సైన్ చేశారు. ఓ సినిమాలో మంచి కీలక పాత్ర ఉండడంతో చేస్తానని ముందుకు వచ్చారు.
ప్రియదర్శి హీరో… ఆనంది హీరోయిన్. ఈ ప్రాజెక్ట్ వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. సినిమా నిర్మించేది ఆసియన్ సునీల్ కుమార్తె జాన్వి. నిర్మాతగా తొలి సినిమా. రానా దగ్గుబాటి ప్రెజెంటర్. ఈ సినిమాకు “ప్రేమంటే” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా ఓ డిఫరెంట్ జానర్. అటు థ్రిల్లర్ అని కాదు, ఇటు రెగ్యులర్ ఫార్మాట్ అని కాదు. కొత్తగా ఉంటుంది. అందుకే ఈ సినిమా మీద బ్యాక్ ఎండ్‌లో గత నాలుగు ఐదు నెలల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సెట్ మీదకు వెళ్తోంది సినిమా. పూజా కార్యక్రమానికి సెన్సేషనల్ దర్శకుడు సందీప్ వంగా స్పెషల్‌గా హాజరయ్యారు.
నవనీత్ శ్రీరామ్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. పుష్కర రామ్మోహనరావు సహనిర్మాత.