కొలిక‌పూడిపై క్ర‌మ‌’శిక్ష’ణ చ‌ర్య‌లు?

కొలిక‌పూడితో తాడోపేడో తేల్చుకోడానికి చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం సిద్ధ‌మైన త‌రుణంలో ఆయ‌న‌పై క్ర‌మ‌”శిక్ష‌”ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావుపై క్ర‌మ‌”శిక్ష”ణ చ‌ర్య‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. కొలిక‌పూడి టీవీ డిబేట్ల ద్వారా సుప‌రిచితుడు. టీడీపీ అనుకూల రాజ‌కీయ విశ్లేష‌కుడిగా, అలాగే వైసీపీని తీవ్రంగా దూషిస్తూ బాబు అనుకూల మీడియాకు ఆప్తుడ‌య్యారు. ఇలాంటి వ్య‌క్తి చ‌ట్ట‌స‌భ‌లో వుండాల‌నే ఉద్దేశంతో ఆయ‌న‌కు చంద్ర‌బాబు స్థానికేత‌రుడు అయిన‌ప్ప‌టికీ తిరువూరు సీటును కొలిక‌పూడికి క‌ట్ట‌బెట్టారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే కొలిక‌పూడి వైఖ‌రిపై టీడీపీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఒక ద‌శ‌లో తిరువూరు టీడీపీ టికెట్‌ను ఆయ‌న‌కు ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే అలాంటివేవీ జ‌ర‌గ‌లేదు. కానీ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయ‌కుల భ‌య‌మే నిజ‌మైంది. ముఖ్యంగా చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గం నాయ‌కుల పాలిట కొలిక‌పూడి ఏకు కాస్త మేకు అయ్యారు.

సోష‌ల్ మీడియాలో త‌న పార్టీ నాయ‌కుల్నే ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తుండ‌డం వాళ్ల‌కు మ‌రింత ఆగ్ర‌హం తెప్పిస్తోంది. కోడి పందేలు ఆడ‌నివ్వ‌న‌ని, జూదం, బెల్ట్‌షాపులను మూసివేయాల్సిందే అంటూ నేరుగా త‌నే అక్క‌డికి వెళ్లి హ‌డావుడి చేయ‌డం కొంద‌రి కోపానికి కార‌ణ‌మైంది.

ఈ నేప‌థ్యంలో ఈ నెల 11న గోపాల‌పురం గ్రామానికి వెళ్లి ర‌హ‌దారి విష‌య‌మై ఇద్ద‌రు దాయాదుల మ‌ధ్య గొడ‌వ‌లో త‌ల‌దూర్చారు. వైసీపీకి చెందిన భాక్యూ కృష్ణ‌, చంటి దంప‌తుల‌పై స్వ‌యంగా కొలిక‌పూడే దాడి చేయ‌డంపై తీవ్ర నిర‌స‌న వ్య‌క్త‌మైంది. దీన్ని కొలిక‌పూడిని వ్య‌తిరేకిస్తున్న టీడీపీ వ‌ర్గీయులు ఆయుధంగా తీసుకున్నారు. సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్ర‌మంలో సోమ‌వారం క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ ఎదుట హాజ‌రు కావాల‌ని కొలిక‌పూడికి నోటీసు ఇచ్చారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు కొలిక‌పూడిని చంద్ర‌బాబు, ప‌ల్లా శ్రీ‌నివాస్ త‌దిత‌ర పార్టీ పెద్ద‌లు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌లో మార్పు రాలేదు. కావాల‌నే త‌మ సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తున్నార‌ని టీడీపీ మాదే అని భావించేవాళ్లు మండిప‌డుతున్నారు. కొలిక‌పూడితో తాడోపేడో తేల్చుకోడానికి చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం సిద్ధ‌మైన త‌రుణంలో ఆయ‌న‌పై క్ర‌మ‌”శిక్ష‌”ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది.

4 Replies to “కొలిక‌పూడిపై క్ర‌మ‌’శిక్ష’ణ చ‌ర్య‌లు?”

  1. అంతే, పార్టీ లో జాయిన్ అయినా తర్వాత వాళ్ళ తో సింక్ అయిపోవాలి.. ఎంత పంచుకోవాలి, ఎలా పంచుకోవాలి, ఎం పంచుకోవాలి.. ఎవరెవరికి ఇవ్వాలి… ఎవర్ని ఎలా ముంచాలి, హింసించాలి..

    లేకపోతే ఎలా.. ఇగో.. ఇప్పుడు ఇలా క్రమ ‘శిక్షణ’ ని వెళ్లాల్సి ఉంటుంది..

    1. అంతేకదా.. డ్రైవర్ ని చంపేసి హోమ్ డెలివరీ చేసినా “క్రమ శిక్షణ” అంటే ఏంటో తెలీని పార్టీ మనది..

      బట్టలిప్పుకుని వీడియోల్లో ఆడిస్తూ చూపించిన నాయకులను పార్టీ అధికార ప్రతినిథి పదవి ఇచ్చి గౌరవించిన పార్టీ మనది..

      అసలు మన పార్టీ కి “క్రమ శిక్షణ కమిటీ” అనేది ఒకటి ఉంటె.. దానికి అధ్యక్షుడు గా ఎవరిని నియమించాలో నిర్ణయించడానికి ఇంకో కమిటీ వేసే బతుకు మనది..

      ఎవరూ సరిపోరని అతి నిజాయితీ.. అతి మంచితనం తో.. క్రమ శిక్షణ కమిటీ నే ఎత్తేసిన చరిత్ర మనది..

  2. కోళ్ళపందేలు, జూదాలు, తాగుడుకు వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పోరాడుతుంటే ఆయనపైనే క్రమశిక్షణా చర్యలా? ఇదేం న్యాయం?

Comments are closed.