సంక్రాంతి సినిమా.. సినిమా ప్రేక్ష‌కుడి మెచ్యూరిటీ!

ఎన్నో సార్లు కొత్త‌ద‌నాన్ని కోరుకుని, కొత్త త‌ర‌హా సినిమాలు చూడాల‌ని ఆశ‌ప‌డి, అదంతా జ‌రిగేప‌ని కాద‌ని వ‌చ్చిన క్లారిటీ ఇది.

సినిమా సూప‌ర్ గా ఉండాలి, సినిమా థియేట‌ర్లో కూర్చున్నంత సేపూ ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఎంట‌ర్ టైన్ చేయాలి, సినిమా అంటే దేనిక‌ది ఒక కొత్త ఫీల్ ఇవ్వాలి, సినిమా అంటే కొత్త‌ద‌నం ఉండాలి, ఉత్సాహాన్ని ఇవ్వాలి, మిగ‌తా ప్ర‌పంచాన్ని రెండున్న‌ర‌గంట‌ల సేపు మ‌రిచిపోయేలా చేయాలి.. ఓవ‌రాల్ గా సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండాలి! ఇది స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఆశించేది. అయితే ఇదంతా ఒక‌ర‌కంగా గ‌తం!

ప్ర‌స్తుత ధ‌ర‌ల్లో ఒక్క కుటుంబం థియేట‌ర్ కు వెళ్లి సినిమా చూడాలంటే.. త‌క్కువ‌లో త‌క్కువ వెయ్యి నుంచి ప‌దిహేను వంద‌ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంది. థియేట‌ర్ కు వెళ్లి ప‌క్క‌చూపులు చూడ‌కుండా సినిమా మాత్ర‌మే చూసి వ‌చ్చేవారు ఆ మేర‌కు పొదుపుగా బ‌య‌ట‌కు రాగ‌ల‌రు. పాప్ కార్న్ తో మొద‌లుపెట్టి ప‌క్క‌చూపులు చేసేవారి సంగ‌తి వేరే! మ‌రి అంత డ‌బ్బు పెట్టినందుకు గానూ.. అంతిమంగా కోరుకునేది ఎంట‌ర్ టైన్ మెంట్. ఇది కూడా గ‌త‌మే!ప్రేక్ష‌కుల కోరిక‌లు ఇప్పుడు కేవ‌లం గ‌తం!

ఈ సంక్రాంతికి విడుద‌లైన సినిమాల విష‌యంలో సోష‌ల్ మీడియాలో, రివ్యూల్లో, ప్రేక్ష‌కుల నుంచి వినిపించిన అభిప్రాయాల్లో.. వింత‌వింత‌లున్నాయి. ఆఖ‌రికి ఎలా త‌యారైందంటే.. ఏ సినిమా గురించి అడిగినా మ‌రో సినిమా క‌న్నా బెట‌రా కాదా అనేదే తీర్పుగా మారింది. సినిమా విష‌యంలో ప్రేక్ష‌కులు రాజీప‌డిపోతున్నారు! ఇంత‌క‌న్నా ఏం ఎక్స్ పెక్ట్ చేయ‌కూడ‌దు, తెలుగు సినిమా అంటే ఇలానే ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఒక స్థిర‌మైన అభిప్రాయానికి వ‌చ్చారు.

కొంత‌కాలం కింద‌టి వ‌ర‌కూ ఏవైనా కొత్త త‌ర‌హా సినిమాలు వ‌స్తాయేమో, కొత్తద‌నంతో ఆక‌ట్టుకుంటాయేమో అనే అంచ‌నాలు ఉండేవి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్ష‌కులు క్లారిటీ వ‌చ్చింది. తెలుగు సినిమాలు అంటే ఇంతే, ఇంత‌కు మించి ఎక్స్ పెక్ట్ చేయొద్దు. ఈ ద‌ర్శ‌కుడి గ‌త సినిమాను బ‌ట్టి.. ఇత‌డు అలాంటి సినిమానే ఇంకోటి తీసివ‌దులుతాడు. ఆ హీరో ఇమేజ్ ను బ‌ట్టి.. కొత్త సినిమా కూడా అత‌డి పాత సినిమాల తానులో ముక్క‌లా ఉంటుంది త‌ప్ప ఇంకో ర‌కంగా అయితే ఉండ‌దు!

ఒక పాన్ ఇండియా హీరో అంటే అందులో ఎలివేష‌న్లే ఉంటాయి క‌థా, కాక‌ర‌కాయి అంటారా ఉంటే ఉంటాయి లేక‌పోతే లేదు. ఒక‌వేళ క‌థ అంటూ ఉన్నా అది పాత‌చింత‌కాయ‌ప‌చ్చ‌డే! దానికి గ్రాఫిక్స్, ఎలివేష‌న్లు తోడ‌వుతాయి. అంత‌కు మించిన సీన్లేమీ ఉండ‌వు!

ఈ మేర‌కు రాజీప‌డిపోతేనే థియేట‌ర్లో సుఖం. అంత‌కు మించి ఆలోచిస్తే మాత్రం.. థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేయ‌డం త‌ప్ప ప‌రిష్కారం లేదు. ఇప్పుడు ప్రేక్ష‌కుల్లో రెండే వ‌ర్గాలు క‌నిపిస్తూ ఉన్నాయి. ఒక‌టి రాజీప‌డి వారు చూపించిందాన్ని చూసి వ‌చ్చే వాళ్లు, రెండో ర‌కం థియేట‌ర్ కు వెళ్ల‌డం మానేసిన వాళ్లు! అభిమాన‌వ‌ర్గాల‌ను మిన‌హాయిస్తే ఇలా దానిక‌న్నా ఇది మేలు, దీనిక‌న్నా అదే కొంత‌లో కొంత మేలు అనుకుని స్వ‌ల్ప‌మైన ఆనందాల‌ను వెదుక్కొనే వాళ్లు చిన్న చిన్న పెద‌వి విరుపుల‌తో ఏదోలే అనుకుంటూ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప‌దేప‌దే ఒకే త‌ర‌హా అనేది న‌స‌గా ఫీల‌వుతున్న వాళ్లు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేశారు.

సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వస్తే మొద‌టిదానిపై తొలిరోజే డివైడ్ టాక్. దానికి డివైడ్ టాక్ రావ‌డం వ‌ల్ల రెండో సినిమానే కాస్త బెట‌ర్ అనే టాక్. ఒక‌వేళ తొలి సినిమా క‌నీసం ఎంట‌ర్ టైన్ చేసి ఉన్నా.. రెండో సినిమా తేలిపోయేది, ఇది పాత‌క‌థే, కొత్త ఎలివేష‌న్ అన్న‌ట్టుగా. అయితే మొద‌టిది తేడా కొట్ట‌డంతో రెండోది కాస్త బెట‌ర్రాబాబూ అనుకోవాల్సి వ‌చ్చింది. రెండో సినిమా విష‌యంలో ప‌డ్డ రాజీ ఏమిటంటే.. ఆ హీరోగారి సినిమాలు అలానే ఉంటాయి, అలా ఉంటాయి.. అలా ఫిక్స‌యిపోండి. అంత‌కు మించి బుర్ర పెడితే ఆ త‌ర్వాత మీ ఖ‌ర్మ అని డిస్ క్లైమ‌ర్ లాగా చూసిన వాళ్లంతా తేల్చిచెప్పారు! ఇక మూడోది వ‌చ్చాకా.. మొద‌టి రెండింటిక‌న్నా ఇది కాస్తోకాస్తో బెట‌ర్ అన్నారు. ఇది న‌మ్మి వెళితే నాన్సెన్సిక‌ల్ కామెడీ! అదేమంటే.. ఆ ద‌ర్శ‌కుడి సినిమాలు అలానే ఉంటాయ‌ట‌!

ఆ హీరో సినిమాలు అలానే ఉంటాయి చూస్తే చూడు లేక‌పోతే పో, ఆ ద‌ర్శకుడి సినిమాలు అనే ఉంటాయి, థియేట‌ర్ కొచ్చింది వాళ్లు చూపించింది చూడ‌టానికే త‌ప్ప మ‌నం కోరుకున్న‌ది చూడ‌టానికి కాదు… ఇలాంటి చాలా మెచ్యూర్డ్ కామెంట్లు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి వినిపిస్తున్నాయిప్పుడు! ఎన్నో సార్లు కొత్త‌ద‌నాన్ని కోరుకుని, కొత్త త‌ర‌హా సినిమాలు చూడాల‌ని ఆశ‌ప‌డి, అదంతా జ‌రిగేప‌ని కాద‌ని వ‌చ్చిన క్లారిటీ ఇది.

17 Replies to “సంక్రాంతి సినిమా.. సినిమా ప్రేక్ష‌కుడి మెచ్యూరిటీ!”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. ప్లే, బాయ్, వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. మొదటి రెండు నాకేసేసాయి..మూడోది గెలిచి నిలిచిందన్న సంగతి వీళ్ళకి నిద్ర పట్టడం లేదు…మొదటి రెండు పక్క చెత్త అని రాస్తే వీళ్ళకి తుప్పు వదిలిపోద్ది…మూడోది గొప్ప అని రాసినా వీళ్ళని వెంటాడుతారు…అది సంగతి..

  4. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu GA ga.

    Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna intha mandi kadupu kodtunnav nee raathalatho.thu..

  5. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu GA ga.

    Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna intha mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  6. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu GA ga.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna intha mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  7. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu GA ga.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  8. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu G A ga.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  9. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu G A g aa.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman dengindi ninnee.siggu ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  10. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu G A g a.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman den g in di ninnee.siggu ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  11. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu G A g a.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman den g in di ninnee.si g g u ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  12. oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu G A g a.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman den g in di ninnee.si g g u ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

  13. Oka cinema teesi ela teeyaalo sollu raayi ra sollu.Vaallu cinemalu teeste nuvvu vankalu petti pagelu nimpi batukutunnav.Indirect ga Thaman den g in di ninnee.si g g u ledu ra oka cinema ni nammukunna inta mandi kadupu kodtunnav nee raathalatho.thu.

Comments are closed.