సంతాన‌మే సంప‌ద అని వాదిస్తే స‌రిపాయె!

అయినా త‌న‌కు అధికారం ఇస్తే సంప‌ద క‌దా సృష్టిస్తాన‌న్న‌ది, ఈయ‌నేంటి సంతానం అంటున్నాడు! సంతాన‌మే సంప‌ద అని వాదిస్తారు కాబోలు ఇక‌!

ఒక్కో జంట ఇద్ద‌రు, ముగ్గురు పిల్ల‌ల‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నాలంటూ చెబుతూ గ‌తంలో ముసిముసిన‌వ్వులు న‌వ్వేవారు చంద్ర‌బాబుగారు! ఇప్పుడు అధికారం వ‌చ్చేస‌రికి.. జ‌నాభా పెంచితేనే స్థానిక ఎన్నిక‌ల్లో పెంచే అవ‌కాశం అంటున్నారు! ఇంత‌కీ ఈయ‌న‌కు అధికారం ఎందుకు ద‌క్కింద‌బ్బా అంటూ కాస్త ఆలోచ‌న ప‌రులు త‌ల‌ప‌ట్టుకుంటూ ఉన్నారు! ఉన్న జనాభాకే దిక్కులేదు, ఉన్న వాళ్ల‌కే ఉద్యోగాలు ద‌క్కే ప‌రిస్థితి లేదు, స‌హ‌జ‌వ‌న‌రులైనా మ‌న‌కు త‌గిన‌న్ని ఉన్నాయా అంటే.. వాటినీ కలుషితం చేసుకుంటూ పోతూ ఉన్నాం! ఇలాంట‌ప్పుడు జ‌నాభా పెంచితే త‌ప్ప మీరు ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేయ‌డానికి వీల్లేదంటూ చ‌ట్టాలు చేసుకుంటూ పోతే, జ‌నాలు ఎగ‌బ‌డి జ‌నాభాను పెంచేస్తార‌ని కాదు కానీ, ఇంత‌కీ చంద్ర‌బాబుకు ఏమైంది? అనేదే ప్ర‌శ్న అవుతుంది!

దాదాపు పాతికేళ్ల కింద‌టి వ‌ర‌కూ భార‌త ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు పెట్టి కుటుంబ నియంత్ర‌ణ గురించి అవగాహణ పెంపొందించ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆ త‌ర్వాత జ‌నాల‌కే అవ‌గాహ‌ణ వ‌చ్చింది. ఇష్టానుసారం పిల్ల‌ల‌ను క‌న‌డం వ‌ల్ల పోష‌ణ ఇబ్బంది అవుతుంది అని వారికి అర్థం అయ్యింది. ఇప్పుడు ప‌రిస్థితులు ఏమీ మారిపోలేదు! ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు.. ఇప్పుడు ఎక్క‌డా ఖ‌ర్చుల్లో తేడా లేదు. మ‌హా అంటే ఇంటి అద్దెల్లో ఒక్క‌టే తేడా! మిగ‌తాదంతా సేమ్ టు సేమ్. ప్రపంచీక‌ర‌ణ ప్ర‌భావం అనుకోవాలేమో ఇది కూడా!

ఒక మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం ఇప్పుడు హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి న‌గ‌రంలో జీవిస్తున్నా, ప‌ల్లెలో జీవిస్తున్నా రోజువారీ ఖ‌ర్చుల్లో తేడా లేదు. అక్క‌డేం తింటారో, ఇక్క‌డా అదే తింటారు. సిటీలో స్పార్ కో, మ‌రో సూప‌ర్ మార్కెట్ కో వెళ్లి కొంటే, ప‌ల్లెల్లో ఉండే వాళ్లు మండ‌ల స్థాయి ప‌ట్ట‌ణంలోకి వెళ్లి లోక‌ల్ సూప‌ర్ మార్కెట్ లో కొంటారు. ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఏమీ లేదు. ఇక నాన్ వెజ్ ధ‌రల్లో కూడా ఎలాంటి వ్య‌త్యాసం లేదు.

న‌గ‌రాల్లో ఓ మోస్త‌రు పాఠ‌శాల‌ల్లో సంవ‌త్స‌రానికి ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కూ ఫీజులుంటే, గ్రామాల్లోని పిల్ల‌ల‌ను కూడా చాలా మంది జిల్లా స్థాయి ప‌ట్ట‌ణాల్లో పెట్టి హాస్ట‌ళ్ల‌లో చ‌దివించినా, లేదా మండ‌ల స్థాయి లోని స్కూళ్ల‌కు పంపినా.. క‌నీస ఫీజులు ల‌క్ష ఇర‌వై వేల వ‌ర‌కూ ఉన్నాయి! ఇంట‌ర్నెట్ రీచార్జ్ లు, ఫోన్ రీచార్జ్ లు ఎక్క‌డైనా ఒక్క‌టే! ఇలాంటి ప‌రిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నా, సిటీలో ఉన్నా ఒక పిల్లాడినో పాప‌నో చ‌దివించుకుంటూ పెంచాలంటే ఏడాదికి క‌నీసం రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి ఉంది.

వాస్త‌వం ఏమిటంటే.. ఆ మాత్రం స్తోమ‌త లేని కుటుంబాలు ఇప్ప‌టికీ కోకొల్ల‌లు. ఒకరే ఉంటే అంత ఖ‌ర్చు పెట్టి చ‌దువు, పోష‌కాహారాన్ని అందించ‌గ‌లిగిన వారు కూడా ఇద్ద‌రంటే మ‌ళ్లీ అష్ట‌క‌ష్టాలూ ప‌డాల్సిందే. ఇది స‌త్యం. దీన్ని నిరాక‌రించే అప‌ర చంద్ర‌బాబు అభిమానుల‌తో వాద‌న అన‌వ‌స‌రం కూడా! ఆ మూర్ఖ‌త్వానికి హ‌ద్దు లేదు. ఉద‌యం లేస్తే పిల్ల‌ల ఫీజులు, వారి ఖ‌ర్చుల లెక్క‌లేసుకుంటూ, వారికి స‌మ‌కూర్చి పెట్టాల్సిన వాటి గురించి జీవితాల‌నే గ‌డిపేసే వాళ్లు కోకొల్ల‌లు. కోట్ల మంది. క‌న్న‌వాళ్ల‌ను ఎట్టికి పెంచేరోజులు కావు ఇవి. కుటుంబప‌రంగానే పిల్ల‌ల‌ను పెంచ‌డం అనేది ఇప్పుడు పెద్ద విన్యాసం. ఒక‌రితో దాన్ని చేయ‌డం ఒక ఎత్తు, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పెంచిపెద్ద చేయ‌డం మ‌రో స‌వాల్! ఆ రెండో స‌వాల్ ను తీసుకునే వారు త‌క్కువ‌వుతున్నారు. దీనికి కార‌ణం వారికి పిల్ల‌లంటే ప్రాణం కాకకాదు, భారం అవుతూ ఉండ‌టం వ‌ల్ల మాత్ర‌మే!

అస‌లు పిల్ల‌ల‌ను క‌న్న‌డ‌మే జీవితానికి భారం, సిటీ లైఫ్ లో ఏ రోజు ఉంటాయో ఎప్పుడో పోతాయో తెలియ‌ని ఉద్యోగాల‌తో పిల్ల‌ల‌నే అద‌న‌పు భారాన్ని నెత్తికెత్తుకోవ‌డం క‌న్నా.. ఈ జీవితాన్ని ఇలా కానిచ్చేస్తే స‌రిపోతుంద‌ని ఆలోచించే వాళ్లూ ఉన్నారు. భారం అనేది నిజం, చాలీచాల‌ని జీతాల‌తో ఆ భారాన్ని నెత్తికెత్తుకున్న వాళ్ల‌ను అడిగితే ఈ విష‌యాన్ని మ‌రింత విపులంగా చెబుతారు. మ‌రి పిల్ల‌ల‌ను పెంచ‌డంలో భారాన్ని ఏమైనా ప్ర‌భుత్వం పంచుకుంటుందా? అంటే అంతా ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి క‌ష్ట‌ప‌డేదీ ఇదే చంద్ర‌బాబులాంటి నేత‌లే!

ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను ప‌ట్టించుకోరు, ప్ర‌భుత్వ వైద్యాశాల‌ల‌ను ప‌ట్టించుకోరు, పిల్ల‌ల‌కు అన్ని వ్యాక్సీన్ల‌ను ఇవ్వ‌లేరు, పిల్ల‌ల పోష‌కాహ‌రం కోసం ఏమీ చేయ‌రు! ప్ర‌జ‌లు మాత్రం పిల్ల‌ల‌ను క‌నేసి, జీవితాల‌ను సార్థకం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్ప‌డం ఆయ‌న తీరుకు ద‌ర్ఫ‌ణం ప‌డుతూ ఉంది.

ఏదో మాట‌లు మాట్లాడేసి అదంతా త‌న విజ‌న్ అని చెప్పుకోవ‌డం లేదిప్పుడు, చ‌ట్టాలు అంటున్నాడు. మ‌రి ఇప్ప‌టికీ కోట్ల మంది పిల్ల‌లు పోష‌కాహ‌ర లోపంతో బాధ‌ప‌డుతున్న దేశంలో, ప్ర‌స‌వంలో మ‌ర‌ణాలు, ప్ర‌సవించ‌డం వ‌ల్ల శారీర‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ త‌గిన పోష‌కాహారం అంద‌క జ‌బ్బుల బారిన ప‌డుతున్న త‌ల్లులు, ప్ర‌స‌వం స‌మ‌యంలో త‌గిన వైద్య సేవ‌లు అందే అవ‌కాశం లేక అప్పుడే ప్రాణాల‌ను పోగొట్టుకుంటున్న స్త్రీలు, గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు త‌గిన వైద్యం-పోష‌ణ లేక పుట్టుక‌తోనే మ‌ర‌ణిస్తున్న శిశువుల లెక్క‌లు లెక్కేసుకుంటున్నాం మ‌నం! దీనికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఏ మాత్రం మిన‌హాయింపు కాదు. వీటికి స‌మాధానం చెప్ప‌లేని పాల‌కులు, పిల్ల‌ల‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నండ‌ని పిలుపును ఇవ్వ‌డం ఏం పాల‌నో మ‌రి.

అయినా త‌న‌కు అధికారం ఇస్తే సంప‌ద క‌దా సృష్టిస్తాన‌న్న‌ది, ఈయ‌నేంటి సంతానం అంటున్నాడు! సంతాన‌మే సంప‌ద అని వాదిస్తారు కాబోలు ఇక‌!

35 Replies to “సంతాన‌మే సంప‌ద అని వాదిస్తే స‌రిపాయె!”

  1. సూపర్ ఐడియా అసలు… గారంటీగా ఎలక్షన్ టైం కల్లా అదే ఎత్తుకుంటారు…. ఇక్కడ ఉండే ఎర్రి గొర్రెపప్పులు హైలెస్సా హైలెస్సా అని డప్పు ఏస్తుంటారు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. vunna vallake jobs leka sastha vunte inka naluguru pilalanu kanali anta !!! manufacturing sector going to replace humans with robots . so jobs are going down in manufacturing sector . only service sector is saving but it require high end skilled labor . with AI Bpo and low jobs going to end . automation is taking over .

    In another 10 years so much is going to change in technology . advanced robotics is going to join .

  4. ఆమ్మో..

    రాష్ట్రం లో ఇన్ని కష్టాలున్నాయా.. ఇంత పేదరికం ఉందా..?

    జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్లు.. పేదోళ్లకు లక్షలు లక్షలు సంక్షేమం పంచేసి వాళ్ళను కోటీశ్వరులను చేసేసాడు కదా.. ఇంకా పేదరికం ఎక్కడుంది.. మరి వాళ్లకు ఈ కష్టాలెందుకు..?

    జగన్ రెడ్డి పాలించిన ఐదేళ్లు.. రైతులందరూ డబ్బుల కట్టలతో ఇల్లు నింపేసుకుని.. ఇక సరిపోక బయట పడేసుకొంటున్నారు.. అని మురిసిపోయారు కదా.. ఇంతలోనే రైతు కి ఇన్ని కన్నీళ్లు ఎందుకు..?

    ..

    జగన్ రెడ్డి అయిదేళ్ల పాలన లో ఆనందపు వెలుగులతో జిగేల్ జిగేల్ మని కళ్ళు మిరుమిట్లు గొలిపేలా విరాజిల్లిన ఆంధ్ర. ప్రజల బతుకులు… ఏడే ఏడు నెలల్లో అంధకారమైపోయిందా..?

    ..

    మూసుకోరా తొత్తునాకొడకా..

    సరిగా జీతాలివ్వలేకపోయాడు.. అడుగు రోడ్డు వేయలేకపోయాడు.. ఉన్న డ్యామ్ గేట్లకు గ్రీసు పూయలేకపోయాడు..

    కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మింగేశాడు.. 6 లక్షల కోట్లు అప్పులు చేసాడు.. మళ్ళీ సీఎం అయిపోతాడనుకుని ప్రజల డబ్బులతో పాలస్ లు కట్టుకున్నాడు..

    ..

    భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు మీకెక్కడ ఉంది..?

    గాడిదకొడకల్లారా..

    1. ఇన్ని సంవత్సరాల అబద్దాల చరిత్ర లో .. ఈ ఒక్క కామెంట్ ఒక్క పాయింట్ మాత్రం నిజం రాసావ్.. ఇన్నాళ్లు అదే నోటితో అబద్దాలు వాగినా.. అదే.. ‘6 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసాడని’.. ఇన్నాళ్లు 14 లక్షల కోట్లు అప్పు చేశామని.. నోటికొచ్చినట్టు .. ప్రచారం చేసినా.

  5. pachha gorrelu jagan sampada srustista ana ledu raa…konni jeevitallo velugu vaste chalu annadu..kinda girrealku article ardhamu ayinatlu ledu..malli okasari chadavandi..lkg lo join avvandi

  6. ఆల్రెడీ బాక్గ్రౌండ్ స్టార్ట్ అయి ఉంటుంది.. ఒక్కసారి వదుల్తారు.. అప్పుడు తెలుస్తాది నీకు, నాకు.

  7. పిల్లల్ని పెంచడం ఇంత కష్టం ఐతే ఎందుకబ్బ,

    మన వొంటే బిడ్డలు, గొర్రె బిడ్డలు వరసపెట్టి పిల్లల్ని కనేసి,

    మిగతా దేశం మీదక వదులుతున్నారు ? వాళ్ళ ఫ్రీ తిండి, చదువులు, ఆరోగ్యం, ఉద్యోగాలు కి పన్ను రూప్లం లో ఖర్చు పెట్టేది, ఒక్క పిల్ల లేదా పిల్లాడు తో సరిపెట్టుకుంటున్న ఆవు బిడ్డలా?

  8. చాల కరెక్ట్ గ చెప్పారు. జగన్ ను సమర్తించేవారు లేదా చంద్రబాబు ను సమర్తించేవాళ్ళు ఉన్నారు. కానీ గుడ్డిగా వాళ్ళని కరెక్ట్ అనేవాళ్ళు దేశానికీ రాష్ట్రానికి కన్నా ఎక్కువ గ వాళ్ళ కుటుంబాలకే అన్యాయం చేస్తున్నారు. ఇప్పడున్న ఖర్చులకు ఇద్దరి కంటే ఎక్కువ కంటే వాళ్ళకు మంచి విద్య వైద్య లను ఇవ్వలేము. జనాభా పెంచడం మొదట నారా లోకేష్ నుంచి రావాలి. వాళ్ళు ఒక్కక్కలనే కంటారు. రాష్ట్రము లో జనాభా పెరిగి ఇంకా కులము మతము ఓటు బ్యాంకు రాజకేయాలకు నేరాలకు హింస ను ప్రేరేపించేలా ఉంటాయి. పెరిగిన జనాభాకు ఇల్లు వాకిలి కింద కస్టపడి సంపాదించుకున్న వాళ్ళ భూములు పంచుతారు డబ్బులు టాక్స్ రూపం లో పిండుకుంటారు. ౧౯౪౭ లో జనాభా కోట్లు ఇప్పుడు . ఉపయోగం సున్యము

    1. రెండే మార్గాలు.

      1) తమకి తినడానికి లేకపోయినా సరే మతం పెరుగుదల కోసం పిల్లల్ని కంటు జనాభా పెంచే వాళ్ళని ఎక్కవ పిల్లలని వద్దు అనడం.

      ఇప్పటి చట్టాల ప్రకారం ఇది సాధ్యం కాదు.

      2) మిగతా మతాల వాళ్ళు కూడా తమ జనాభా పెంచుకోవడం, తమ దేశాలను, ప్రాంతాలని తమ చేతుల్లో నుండి అరబ్బు బిడ్డల చేతుల్లో కి పోకుండా కాపాడుకోవడం.

      ఇదే మిగిలిన ఆప్షన్.

  9. పెపంచం లో అన్ని చోట్ల జరుగుతున్న సంగతి.

    ఒంటె బిడ్డలు ఎలుకలు ఎలా ఎక్కవ పిల్లల్ని పెట్టినట్లు,

    వరసపెట్టి పిల్లల్ని కని తమ మతం జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నారు. ఆ ప్రాంతం తమదే అంటున్నారు.

    దానితో సమాజాల్లో వైరుధ్యం ఏర్పడుతుంది.

    మీ చుట్టుపక్కల చూడండి.

    ఒంటె బిడ్డలు కేంద్రీకృతం అయిన ప్రాంతాల్లో మిగతా వాళ్ళ పరిస్తిడి ఎలా వింది అనేది ?

    1. ఆ ప్రమాదం నుండి తప్పించడానికీ,

      ఇప్పుడు విదేశాల్లో క్రైస్తవులు మేల్కొని, తాము కూడా పిల్లలో కంటే ప్రభుత్వమే డబ్బు ఇస్తుంది అని తమ జనాభా పెంచుకోవాలి అని చెబుతున్నారు.

      ఇండియా లో కూడా ఇదే ప్రమాదం .

      అందుకే హిందువులు కూడా పిల్లల్ని కనమని చెబుతున్నారు.

      ఒంటె బిడ్డలని పిల్లల్ని కనడం ఆపమని చెప్పలేం కనుక, ఇదే తప్పని సరి మార్గం,.కష్టమైన సరే.

  10. ఇప్పుడు పేపంచం లో జనాభా ఎక్కవ ఎవరు వుంటే వాళ్ళదే బలం. అందుకే మక్కా ఇస్లాం సూటిగా సుత్తి లేకుండా చెప్పారు, ఒక్కో ముస్లిం ఫ్యామిలీ కనీసం ఇద్దరి తగ్గకుండా పిల్లల్ని కనమని, వ్వీలు ఐతే కనీసం 6 గుర్ని కనమని. అందుకే, హిందువులు , విదేశీ క్రైస్తవులు పొదుపుగా పిల్లల్ని ఒకరితో ఆపుతుంటే, ముస్లిం సమాజం లో మాత్రం పిల్లలకి అదుపు లేకుండా కంటున్నారు.. వాళ్ళ జనాభా 10 శాతం చేరగానే, అకకడ షరియా ఇస్లాం చట్టం కావాలో అని గొడవ మొదలు పెడతారు. యుకె ఇప్పటికే ఇస్లాం గుప్పిట్లోకి వెళ్ళిది.

    పోరాటం చేయకపోతే, ఇండియా పరిస్ట్సిడి కూడా ఇదే

  11. గ్రూమింగ్ గ్రూప్స్ అనేవి యుకె లో ముస్లిం యువకులు గ్రూప్. వాళ్ళు పని అక్కడి స్థానిక చర్చ్ కి వెళ్ళే క్రైస్తవ మైనారిటీ అమ్మాయిల నీ టార్గెట్ చేసి రేప్ చేసి పిల్లల్ని కనడం, వాళ్ళని ముస్లిం లాగ నమోదు చెయ్యడం. అలా తమ ముస్లిం జనాభా పెంచుకోడం.ఇది 2025 జరుగుతున్న తతంగం.

    దెబ్బకి అక్కడి క్రైస్తవులు మేల్కొని తమ అమ్మాయిలని ఈ ముస్లిం లా నుండి కాపాడాలి అని ఏకంగా యుకె పార్లమెంట్ లో బిల్లు పెట్టారు.

    ఇదే జనాభా పెంపుదల యొక్క రహస్యం.

  12. గ్రూ*మిగ్ గ్యాం*గ్ అని కొట్టి చూడండి, ముస్లిం లో తమ మతం జనాభా పెంచుకోడానికి ఏమో చేస్తారు అనేది అర్థం అవుతుంది.

  13. ఎలాన్ మాస్క్ కూడా ఇదే చెప్పాడు,

    ఒక్క బిడ్డ తో ఆపేసిన చైనా వాళ్ళు కూడా తమ జనాల్ని ఎక్కువ పిల్లల్ని కనమని చెబుతున్నారు

    జపాన్ లో కొత్తగా పెళ్లైన వాళ్ళకి ప్రభుత్వమే అడుగుతుంది, పిల్లలు త్వరగా కనమని.

  14. లో ఉమ్మడి ఆంధ్ర జనాభా కోట్లు ౨౦౨౪ లో కేవలం ఆంధ్ర జనాభా కోట్లు. పొలాలు లేదా భూమి పెరిగిందా పోనీ పేదరికం పోయిందా. జనాభా పెరగడం కేవలం పెత్తందార్లకు అవసరం. జనాభా పెరగడం వలన కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం నిరుద్యోగం పెరుగుతాయి

  15. మత జనాభా విస్తరణ – బెల్లీ జీహాద్ : పిల్లలని విపరీతంగా కని, ఆ ప్రాంతం లో ముస్లిం ల జనాభా నీ పెంచడం. తర్వాత ఆ ప్రాంతం నీ ముస్లిం మత మార్గం లో మార్చడం.

    ప్రపంచం లో అన్ని చోట్ల శర వేగంగా జరుగుతున్న మత పరమైన మిషన్.

    ఎవరు కూడా వద్దు అని అడ్డు చెప్ప లేని సులభ మార్గం.

    మిగతా మతాల వాళ్ళు ( క్రైస్తవులు, బుద్దులు, యూదులు, హిందువులు ) అందరూ దీని బాధితులే.

    క్రైస్తవుల కి , ముస్లిం లకి అనేక దేశాలు వున్నాయి, ఒకటి తగ్గిన సరే , నష్టం లేదు.

    కానీ హిందువుల లో ప్రపంచం లో వున్న ఒకే ఒక దేశం భారత దేశం. అది హిందువుల చేతుల్లో నుండి దాటిపోయి న దా , ఇంకా హిందువుల నీ కాపాడటం ఎవరికి కుదరదు. అందుకే మేల్కొండి.

    సైకిల్ రిపేర్ షాపు లో మస్తాను గారు 6 పిల్లల్ని కన్నప్పుడు, నెలకి 2 లక్షలు వచ్చే సుబ్బారెడ్డి గారు, కనీసం 2 పిల్లలు కనడానికి వచ్చే నష్టం ఏమిటి.

    ఇలా చేయకపోతే, ఆ సుబ్బారెడ్డి గారు ఒక్క పిల్లాడి ఆస్తులు, ఆ మస్తాన్ గారి 6 గురు పిల్లల చేతుల్లో కి వెళ్లిపోతాయి.

  16. తాను తినడానికి తిండి లేని వాడుకి, వరస పెట్టీ పిల్లలు కనే హక్కు వుంటుందా?

    కనీస తిండి కి ఆదాయం వున్న వాడికే పిల్లల్ని కనే హక్కు వుండాలి అని ప్రభుత్వం ఏమన్నా రూల్ పెట్టే అవకాశం వుందా ?

    పిల్లలకి కనీసం పాలు కొనే ఆదాయం లేని వాళ్ళ 6 పిల్లల్ని కంటే , వారి మీద ప్రభుత్వ వేసే శిక్ష ఏంటి?

    ఇప్పుడు అలాంటి వాళ్ళకే, అన్ని ఫ్రీ ఇస్తున్నారు కదా, మిగతా వాళ్ళు కష్టం పడి పన్ను డబ్బు కడుతూ వుంటే.

  17. బాబు గారు మీరు ఎన్ని అయినా చెప్పుతారు… మీర కష్టం లేకుండా చినబాబు కనేశారు… మీ ప్రమేయం లేకుండా సత్యం రామలింగరాజు చదివించారు.. మీ శ్రమ లేకుండా ఎన్టీఆర్ పార్టీ ఇచ్చాడు.. evm పుణ్యమనా డీసీఎం చేస్తున్నారు

Comments are closed.