పెద్ద మనుషుల మ‌ధ్య‌ జ‌గ‌న్ ఇళ్ల గురించి చ‌ర్చా?

కీల‌క‌ మంత్రి భేటీ అయిన‌ప్పుడు టైమ్ పాస్ మాట‌లు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లున్నాయి. వాటిని ప‌రిష్క‌రించుకోడానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో సాయం అందించాల్సి వుంది. విభ‌జన చ‌ట్టంలో ఉన్న‌వే ఇంత వ‌ర‌కూ తీర్చ‌న‌వి ఉన్నాయి. వాటి గురించి ఊసే లేదు. ఏపీలో అధికారంలో ఎవ‌రున్నా, రాష్ట్ర హ‌క్కుల్ని సాధించుకోడానికి గ‌ట్టిగా నిల‌దీసే ప‌రిస్థితి లేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కేసుల సాకుతో బీజేపీ పెద్ద‌లు త‌మ గుప్పిట్లో పెట్టుకున్నార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఈ నేప‌థ్యంలో ఏపీలో కేంద్ర‌హోంమంత్రి, ప్ర‌ధాని మోదీ త‌ర్వాత అత్యంత శ‌క్తిమంత‌మైన నాయ‌కుడైన అమిత్‌షా ప‌ర్య‌ట‌న ప్రాధాన్యం సంత‌రించుకుంది. అమిత్‌షాతో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి, ఆయ‌న నుంచి స్ప‌ష్ట‌మైన హామీ పొందుతార‌ని ఆశించిన ప్ర‌జానీకానికి ఒకింత నిరాశే. వీళ్ల భేటీలో కూడా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గురించే చ‌ర్చ జ‌ర‌గ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

జ‌గ‌న్‌కు ఎన్ని ప్యాలెస్‌లు ఉన్నాయ‌ని అమిత్‌షా అడ‌గ‌డం, బెంగ‌ళూరులో 32 ఎక‌రాల్లో పెద్ద ప్యాలెస్‌, హైద‌రాబాద్‌లో వంద గ‌దులున్న ప్యాలెస్ ఉన్న‌ట్టు లోకేశ్ చెప్పార‌ట‌. అమిత్‌షా ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ప‌నిలో ప‌నిగా విశాఖ ప‌ట్నంలో రుషికొండ‌పై టూరిజం శాఖ నిర్మించిన భ‌వ‌నాన్ని కూడా జ‌గ‌న్ ప్యాలెస్‌గానే అమిత్‌షాకు చెప్ప‌డం విశేషం. అలాగే తాడేప‌ల్లిలో కూడా ప్యాలెస్ క‌ట్టుకున్న‌ట్టు అమిత్‌షాకు లోకేశ్ వివ‌రించార‌ట‌.

అలాగే జ‌గ‌న్ జ‌నంలో తిరుగుతున్నారా? ఏం చేస్తున్నార‌ని కేంద్ర హోంశాఖ మంత్రి ఆరా తీసిన‌ట్టు టీడీపీ అనుకూల మీడియా రాసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి, దేశంలోనే శ‌క్తిమంత‌మైన నాయ‌కుడిగా పేరు పొందిన అమిత్‌షా, అలాగే రాష్ట్ర ముఖ్య‌మంత్రి, డిప్యూటీ సీఎం, కీల‌క‌ మంత్రి భేటీ అయిన‌ప్పుడు టైమ్ పాస్ మాట‌లు మాట్లాడ్డం విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ర‌చ్చ‌బండ ద‌గ్గ‌ర‌, టీ స్టాళ్ల వ‌ద్ద పొద్దు పోవ‌డం కోసం మాట్లాడుకున్న‌ట్టుగా, జ‌గ‌న్‌కు ఎక్క‌డెక్క‌డ ఇళ్లున్నాయ్‌? ఎన్ని గ‌దులున్నాయ‌ని ముఖ్య నాయ‌కులు మాట్లాడుకున్నార‌న్న స‌మాచారం… ఎలాంటి సంకేతాలు పంపుతుందో వాళ్లే ఆలోచించుకోవాలి. జ‌గ‌న్ గురించి అమిత్‌షా తెలుసుకోవాలంటే చంద్ర‌బాబు, లోకేశ్‌ను అడ‌గాలా? ఆయ‌న‌కు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలున్నాయి క‌దా, అవి చెప్ప‌వా? పెద్ద మ‌నుషులు చ‌ర్చించుకోవాల్సిన సంగ‌తులు ఇవేనా? అనే అభిప్రాయం మాత్రం క‌ల‌గ‌కుండా వుండ‌దు.

రాష్ట్రానికి ప‌నికొచ్చే మాట‌లు మాట్లాడ‌ర‌ని తెలిస్తే, జ‌నం ఎంతో సంతోషించేవాళ్లు. కానీ అమిత్‌షాతో భేటీలో అలాంటివేవీ జ‌ర‌గ‌క‌పోవ‌డం రాష్ట్ర ప్ర‌జానీకానికి నిరుత్సాహం క‌లిగిస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

32 Replies to “పెద్ద మనుషుల మ‌ధ్య‌ జ‌గ‌న్ ఇళ్ల గురించి చ‌ర్చా?”

  1. అంటె వాళ్ళు రాజకీయాల గురించి అవినీతి గురించి మాట్లాడుకొరా?

    అలానె రిషి కొండ ప్యలెస్స్ NGT అతిక్రమన గురించి మాట్లాడుతూ ఈ విషయం వచ్చి నట్టు ఉంది.

  2. నువ్వు రియల్ జర్నలిస్ట్ అయితే రిసార్ట్ కి కొంపకి తేడా తెలిసేది, నువ్వేమో టిష్యూ పేపర్ ఎర్నలస్ట్ వి మరి బోకు గాడు పెట్టిన గడ్డి తిన్న విశ్వాసం చూపిస్తున్నావ్ !!

  3. “రాష్ట్రానికి ప‌నికొచ్చే మాట‌లు మాట్లాడ‌ర‌ని”..yes, agreed…not letting pichodu again to power.

  4. Valla meeting lo gre8 Andhra vundi anukunta..ne journalism values ki joharlu..pichi rathalu marchuko..ne articles okatina nijam ga rasava…mari marava..Inka yennalu ycheepi ki banisiga vuntav..

    1. సీఎం అయినా రెండో రోజే ప్రజావేదిక కూల్చేసిన .. వీరుడు, శూరుడు, ధీరుడికి..

      అయిదేళ్ల సమయం లో.. ఈ నదీగర్భంలోని కరకట్ట కొంపని మాత్రం తాకలేకపోయాడు..

      దీన్నే.. కొబ్బరిమట్ట కబుర్లు అంటారు..

    2. తాడేపల్లి లో ప్యాలెస్ కట్టుకుని అమరావతి లో గృహప్రవేశం చేసుకున్నానని నమ్మించి అధికారం లోకి వచ్చాక అమరావతి ఎడారి, శ్మశానం అని సునకానందం పొందాడు ఒకాయన

  5. మనం పీకింది ఎం లేనప్పుడు అవతోలడు చేసింది మాట్లాడు కోవడమే.. అంతకు మించి పీకింది ఏముంది..

    1. అందుకేగా 11 పీకారు మన జగన్ రెడ్డన్న కి..

      ఈ సారి కాస్త జాలి చూపిస్తారులే.. ఇంకాస్త తక్కువే పీకుతారు..

  6. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  7. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  8. అవతోలడు చేసింది .. అవినీతి అయినా కూడా మాట్లాడుకోకుడదా రెడ్డి?

    ఇదే ABN ఆర్కే చంద్రబాబు గురించో, పవన్ కళ్యాణ్ గురించో రాస్తే.. నీ భుజాలు గజాలైపోయేవి.. పేజీలకు పేజీలు ఆర్టికల్స్ రాసి పడేసేవాడివి..

    అదే జగన్ అవినీతి గురించి రాసేసరికి.. పచ్చ మీడియా అంటూ అలుగుతున్నావు.. ఏడుస్తున్నావు..

    ..

    విశాఖ ఉక్కు కి 11440 కోట్ల ప్యాకెజీ ఇస్తే.. ఆ ముక్క రాయడానికి నీకు, నీ నీలి మీడియా కి మనసొప్పలేదు..

    కానీ.. అందులో వంకలు వెతుకుతో.. ఏడుస్తూ.. రాతలు రాసావు నువ్వు, నీ సాక్షి..

    ..

    ఇదీ మీ బతుకులు..

    1. ఉన్న ఒక్క న్యూట్రల్ మీడియా మీద ఇలా విరుచుకుపడితే ఎలా అండీ..అసలే ప్రాణాలకు తెగించి జనల ముందుకు నిష్పక్షపాతం గ వారట్లు తెస్తున్నారు …..

  9. Antey Central HM ki evvani teliyava???Ee musali NK kooda pappu and blade batch leader ye cheppala??Central intelligence yem peekutundo??Ee vedhavalaki adigi telusukunnadu🤣🤣🤣

  10. errihooka great andhra gaadu, ore GA gaa nuvvu ye artical raasinaa daaniki elago ala jagan tho link petti jagan mogga gudavataaniki chaalaa mandi pacha koolinaa.ko.du.ku.lu kaachukoni vunnaaru. vaallani entertain chestu, vaalla mogga ku.du.stunnaavaa raa ? memu edanna coment pedite moderate ani block chestunnaav karada.

  11. అయన అడగటం , వీళ్ళు చెప్పటం , మళ్ళీ అయన ఆశ్చర్యం చెందటం. చూడటానికి విడ్డూరంగా లేదా?. కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాకి దేశంలో వున్న అందరి నాయకుల జాతకాలు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఇక జగన్ కి ఎన్ని ఆస్తులు, ఎన్ని పాలస్ లో ఉన్నాయో తెలియదా ?

Comments are closed.