సైరా ఫస్ట్ షెడ్యూల్.. మళ్లీ మొదలైంది

సెకెండ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ మొదటి షెడ్యూల్ నే మళ్లీ కొనసాగించాలని నిర్ణయించారు. అవును.. సైరా సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ నే మరో 3రోజుల పాటు…

సెకెండ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ మొదటి షెడ్యూల్ నే మళ్లీ కొనసాగించాలని నిర్ణయించారు. అవును.. సైరా సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ నే మరో 3రోజుల పాటు కొనసాగించబోతున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పార్ట్-2 మళ్లీ షురూ కానుంది.

ఈనెల 5వ తేదీ నుంచి 3రోజుల పాటు సైరా ఫస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలవుతుంది. ఫస్ట్ షెడ్యూల్ లో మిగిలిపోయిన యాక్షన్ సీక్వెన్స్ ను ఈ 3రోజుల్లో పిక్చరైజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో చిరంజీవికి నచ్చని కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని రీషూట్ చేయబోతున్నారనేది వాస్తవం.

5, 6, 7 తేదీల్లో పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో మళ్లీ సేమ్ లొకేషన్ లో సైరా షూటింగ్ కొనసాగుతుంది. ఈ 3రోజుల షూటింగ్ పూర్తయిన తర్వాత సెకెండ్ షెడ్యూల్ వివరాల్ని వెల్లడిస్తారు. ఈ షూట్ కోసం చిరంజీవి మళ్లీ గడ్డం, మీసం పెంచిన విషయం తెలిసిందే.

సైరా సెకెండ్ షెడ్యూల్ కు సంబంధించి అమితాబ్, నయనతార నుంచి ఇంకా సమాచారం రాలేదని తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన కాల్షీట్లు ఆధారంగా రెండో షెడ్యూల్ డేట్స్ ను ప్రకటిస్తారు. ఈలోగా ఫస్ట్ షెడ్యూల్ లో తీసిన సన్నివేశాలకు రిపేర్లు చేస్తారన్నమాట. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. సురేందర్ రెడ్డి దర్శకుడు.