Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా ఎఫెక్ట్.. ఆర్.ఆర్.ఆర్ కు రిపేర్లు

సైరా ఎఫెక్ట్.. ఆర్.ఆర్.ఆర్ కు రిపేర్లు

సైరా నరసింహారెడ్డి సినిమా అంతా బాగానే ఉంది, కానీ ఒకే ఒక్క కంప్లయింట్. ఇందులో పాన్-ఇండియా కంటెంట్ లేదనేది అందరి వాదన. సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ మారుమూల ప్రాంతంలో ఓ పోరాటయోధుడి కథ. అందుకే దీన్ని భారతదేశమంతా ఓన్ చేసుకోలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో క్లిక్ అయినా, పొరుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు తగ్గడానికి అదే ప్రధాన కారణం. బాహుబలి, కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు పొరుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, సైరా ఫెయిల్ అవ్వడానికి ఇదే ప్రధానమైన తేడా.

ఇది కేవలం సైరాకు సంబంధించిన సమస్యే కాదు, ఇలాంటి సినిమాలు చేయాలనుకుంటున్న, చేస్తున్న తెలుగు దర్శక నిర్మాతలందరూ దృష్టిపెట్టాల్సిన అంశం. మరీ ముఖ్యంగా రాజమౌళి ఎక్కువగా ఈ విషయంలో టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోంది. కెరీర్ లో తొలిసారి హిస్టారికల్ సబ్జెక్ట్ తీసుకున్నాడు రాజమౌళి. సైరా కూడా చరిత్రకు సంబంధించిన కథే కావడంతో ఇప్పుడు రాజమౌళి ఆలోచనలో పడ్డాడు.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అంటూ తెలుగువీరుల కథలను తెరపైకి తీసుకొచ్చాడు రాజమౌళి. ఒకే కాలానికి చెందినవారే అయినప్పటికీ ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు. చరిత్రలో కలవని వీళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం అయితే ఎలా ఉంటుందనే ఆలోచనకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్న కథ ఆర్-ఆర్-ఆర్.

ఇలా చరిత్రకు తనదైన మార్పులు చేశాడు రాజమౌళి. అయినప్పటికీ సైరా రిజల్ట్ చూసిన రాజమౌళికి ఏదో మూల చిన్న అనుమానం, భయం కలుగుతున్నాయి. తెలుగు వీరుల కథను చెబితే దేశమంతా ఆసక్తిగా వింటుందా అనే డైలమాలో పడ్డాడు రాజమౌళి. అందుకే స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేయడానికి సిద్ధమౌతున్నాడు.

ఇప్పటివరకూ తీసిన సబ్జెక్ట్ కి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా, ఇకపై తీసే సన్నివేశాల్లో ఎక్కడా స్థానికత హైలెట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తెలుగు వీరుల చరిత్రను, ప్రపంచవీరుల చరిత్రగా చెబితేనే సినిమాకు యూనివర్సల్ అప్పీల్ వస్తుందనే విషయాన్ని సైరా చూసి నేర్చుకున్నాడు రాజమౌళి. అదే ఇప్పుడు ఆర్-ఆర్-ఆర్ స్క్రిప్ట్ లో మార్పుచేర్పులకు కారణమైంది. 

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?