సైరా తెరపైకి వినాయక్ పేరు

ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో క్లియర్ గా తెలియడం లేదు కానీ ఏదో జరుగుతోంది. సైరా సినిమా విషయంలో వినవస్తున్న గ్యాసిప్ లు ఇన్నీ అన్నీ కావు. డైరక్టర్ సురేందర్ రెడ్డి పని తీరుతో…

ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో క్లియర్ గా తెలియడం లేదు కానీ ఏదో జరుగుతోంది. సైరా సినిమా విషయంలో వినవస్తున్న గ్యాసిప్ లు ఇన్నీ అన్నీ కావు. డైరక్టర్ సురేందర్ రెడ్డి పని తీరుతో మెగాస్టార్ చిరంజీవి అంత సంతృప్తికరంగా లేరన్న వార్తలు ముందే వినవచ్చాయి. బ్యాక్ ఎండ్ లో గుణశేఖర్ ను పెడదామా అన్న టాక్ కూడా వచ్చిందనీ గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ మరీ సంచలనంగా వుంది. మెగాస్టార్ కు మెగా హిట్ లు ఇచ్చిన డైరక్టర్ వివి వినాయక్ ను ప్రాజెక్టులోకి తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారని వార్తలు గుప్పమన్నాయి. అయితే వినాయక్ సన్నిహితులు దీనిని ధృవీకరించడం లేదు. తమను మరి కొంతమంది కూడా ఇదే విషయం అడిగారని, అయితే తమకు తెలిసినంత వరకు అలాంటిది ఏమీ వినాయక్ వరకు రాలేదని వెల్లడించారు. 

కానీ ఇండస్ట్రీలో అప్పుడే సైరా డైరక్టర్ మారిపోయారు, వినాయక్ ను తీసుకుంటున్నారన్న గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి. ఈ విషయంలో చరణ్ కు చిరుకు మధ్య కాస్త ఢిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వుందని, దీనికి చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. సైరా తరపున మెగాస్టార్ నో, చరణ్ నో క్లారిటీ ఇచ్చేవరకు ఇవి ఆగవేమో?

ఇప్పటికే కెమేరామన్, మ్యూజిక్ డైరక్టర్ మారిపోయారు. హీరోయిన్ నయనతార వ్యవహారం ఊగిసలాడుతోంది. ఇక ఇప్పుడు డైరక్టర్ కూడా అంటే సైరా ప్రాజెక్టుకు కాస్త కష్టమే.