సైరా ఆడియోకి కోట్లు?

సైరా సినిమా విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేసేలా కనిపిస్తోంది. మెగాస్టార్ తో సురేందర్ రెడ్డి అందించే రామ్ చరణ్ సినిమాకు మార్కెట్ ఓ రేంజ్ లో వుండేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆడియో…

సైరా సినిమా విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేసేలా కనిపిస్తోంది. మెగాస్టార్ తో సురేందర్ రెడ్డి అందించే రామ్ చరణ్ సినిమాకు మార్కెట్ ఓ రేంజ్ లో వుండేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆడియో హక్కుల కోసం పోటీ మొదలయిందని టాక్. వినిపిస్తున్న ఫిగర్లు వింటుంటే, అవునా? అని అనే రేంజ్ లో వున్నాయి. సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ పాటలు నోటికి పట్టి, హిట్ అనిపించుకున్నవి గడచిన అయిదారేళ్లలో గట్టిగా అరడజను వుండవు. ఇప్పుడు ఆయనే సైరాకు సంగీత దర్శకుడు.

అయితే భారీ అంచనాలు వున్న సినిమా కావడం, సురేందర్ రెడ్డి, చిరంజీవి కలిసి మంచి పాటలు చేయించుకుంటారు అనే నమ్మకం వుండడంతో సైరా సినిమా ఆడియో హక్కుల కోసం మాంచి పోటీ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆదిత్య, లహరి కంపెనీలు పోటీ పడగా, లహరి సంస్థ ఆడియో హక్కులకు ఫైనల్ లిస్ట్ కు చేరినట్లు వినికిడి. కానీ ఫిగర్ మాత్రం కాస్త ఎక్కువే వుంది. పక్కగా తెలిసే వరకు నమ్మశక్యంగా లేదు.

2.90 కోట్లకు ఆడియో హక్కులు తీసుకున్నారని తెలుస్తోంది. ఆదిత్య సంస్థ 2.40 లక్షలకు వరకు వెళ్లిందని వినికిడి. అయితే ఇటీవల ఆదిత్య సంస్థ ఆడియో హక్కులను తగ్గించుకుంటోంది. సినిమా నిర్మాణం వైపు దృష్టి పెడుతోంది. అందుకే అక్కడితో ఆగిపోయిందని, మెగా క్యాంప్ లో ఎక్కువగా సినిమాలు కొంటున్న లహరి ముందుకెళ్లి సైరా ఆడియో హక్కులు చేజిక్కించుకుంటోంతదని తెలుస్తోంది.