మెగాస్టార్ మెగా మూవీ సైరా. ఏకంగా బాహుబలి రేంజ్ లో తీయాలని, కనీసం బాహుబలి రికార్డులకు చేరువ కావాలని చేసిన ప్రయత్నం. మెగాస్టార్ కు మెమరబుల్ మూవీగా అయితే మిగిలింది కానీ లాభాలు తేలేకపోయింది. పైగా భారీగా నష్టాలు మిగిల్చింది. ఈ నష్టాలు ఏ మేరకు అన్న దాని మీద భిన్నమైన వార్తలు వున్నాయి.
కానీ లేటెస్ట్ గా లెక్కలు అన్నీ చూసుకున్న తరువాత దగ్గర దగ్గర నికరంగా నష్టం 40 కోట్ల అని తేలినట్లు తెలుస్తోంది. ఇది కూడా మెగాస్టార్ రెమ్యూనిరేషన్ తీసుకోకుండా ఫ్రీగా చేసారని అనుకుంటే. అలా కాకుండా ఆయన రెమ్యూనిరేషన్ కూడా నష్టపోయారు కనుక, టోటల్ గా కనీసం 70 కోట్లు నష్టం తేలినట్లు తెలుస్తోంది.
ఈ లాస్ కవర్ కోసం ఇప్పుడు తీస్తున్న కొరటాల శివ సినిమా విషయంలో కేర్ తీసుకుంటున్నారు. వీలయినంత జాగ్రత్తగా తీసి, మార్కెట్ చేసి, సైరా లాస్ ను కవర్ చేసుకోవాలన్నది నిర్మాత రామ్ చరణ్ ఆలోచనగా వుంది. కచ్చితంగా ఈ సినిమా కూడా థియేటర్ – నాన్ థియేటర్ కలిపి 150 కోట్ల మేరకు మార్కెట్ అవుతుంది. సినిమాను 70 నుంచి 80 కోట్లలో తీయగలిగితే సైరా లాస్ లు కవర్ అయిపోతాయి.