దూరం పెట్టిందని అందరికీ దూరం చేశాడు

“మాట్లాడుకుందాం రా అంటూ మేడపైకి పిలిచాడు. మాటమాట పెరిగింది. ఆవేశంతో దగ్గర్లో ఉన్న పదునైన రాయితో గొంతులో పొడిచాడు. అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మేడపై నుంచి తోసేశాడు.”  Advertisement హైదరాబాద్ వారాసిగూడలో జరిగిన…

“మాట్లాడుకుందాం రా అంటూ మేడపైకి పిలిచాడు. మాటమాట పెరిగింది. ఆవేశంతో దగ్గర్లో ఉన్న పదునైన రాయితో గొంతులో పొడిచాడు. అక్కడికక్కడే చనిపోయింది. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మేడపై నుంచి తోసేశాడు.” 

హైదరాబాద్ వారాసిగూడలో జరిగిన హత్యను 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఓ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తనకంటే రెండేళ్లు పెద్దవాడైన సోహెబ్ ను ప్రేమించింది. రెండు కుటుంబాలు అభ్యంతరం పెట్టాయి. దీనిపై పంచాయితీ కూడా జరిగింది. దీంతో కొన్నాళ్లుగా సోహెబ్ కు దూరంగా ఉంటోంది అమ్మాయి.

ఊహించని విధంగా తన ప్రేయసి తనతో మాట్లాడకపోవడంతో సోహెబ్ కక్ష కట్టాడు. మాట్లాడుకుందాం రమ్మని మేడపైకి పిలిచాడు. మాటామాట పెరగడంతో చేతికి దొరికిన రాయితో గొంతులో పొడిచాడు. అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా.. ఏం చేయాలో తెలియని సోహెబ్, అమ్మాయిని మూడంతస్తుల భవనం నుంచి కిందకు తోసేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే 
ప్రయత్నం చేశాడు. 

అమ్మాయి తల్లి ఫిర్యాదుతో సోహెబ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టయిల్ లో విచారించగా అతడు నిజం ఒప్పుకున్నాడు. తనే అమ్మాయిని చంపేసి కిందకు తోసేసినట్టు ఒప్పుకున్నాడు. మరోవైపు దగ్గర్లోని సీసీ కెమెరాల్లో సోహెబ్ అక్కడే ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసుపెట్టారు.

నాన్ను ఒక్క డైరెక్టర్ చిన్న హీరో అన్నారు