సైరా రిహార్సల్ షూట్?

మెగాభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న సైరా షూటింగ్ డిసెంబర్ 6న ప్రారంభమవుతోంది. ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసారు. ఈ షూట్ కోసం సుమారు వంద మంది విదేశీ జూనియర్…

మెగాభిమానులు ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న సైరా షూటింగ్ డిసెంబర్ 6న ప్రారంభమవుతోంది. ఇందుకోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసారు. ఈ షూట్ కోసం సుమారు వంద మంది విదేశీ జూనియర్ ఆర్టిస్టులను సమీకరిస్తున్నారు. వీలయినంత వరకు హైదరాబాద్, ముంబాయి ల నుంచి రప్పించాలని, చాలకపోతే బయట నుంచి రప్పించాలని భావిస్తున్నారు.

ఇదిలా వుంటే అసలు విషయం వేరే వుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఈ నెల ఆరు నుంచి పది రోజుల పాటు సైరా సినిమా షూట్ ను సిన్సియర్ గానే చేస్తారు. కానీ పది రోజుల తరువాత ఆపేసి, ఆ ఫుటేజ్ ను పూర్తిగా పరిశీలిస్తారట.

మెగాస్టార్ చిరంజీవి గెటప్ అన్ని విధాలా సరిపోయిందా లేదా? అన్న దానిపై డిఫరెంట్ ఒపీనియన్లు తీసుకుని, అన్ని విధాలా సంతృప్తి వస్తే, షూట్ మళ్లీ స్టార్ట్ చేస్తారట. లేదూ అంటే, ఈ ఫుటేజ్ అంతా పక్కన పడేసి, గెటప్ లో కావాల్సిన ఛేంజెస్ చేసి, మళ్లీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అంటే ఒక విధంగా ఇది రియల్ రిహార్సల్ షూట్ అన్నమాట.

నూటయాభై కోట్ల సినిమా కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు వుండడం అవసరమే. పైగా చిరంజీవి ఏదీ ఒకపక్కన ఫిక్స్ కారు. ఖైదీ 150సినిమా విషయంలో కూడా ఇలాగే చాలా కిందా మీదా పడి, జాగ్రత్తలు తీసుకున్న తరువాతే పూర్తి చేసారు.