అల్లు అరవింద్..టాలీవుడ్ సౌండ్ పార్టీల్లో ఒకటి. ఇటీవల ఆయన నెల్లూరు ప్రాంతానికి వెళ్లారట. వెళ్లింది ఓ పెళ్లికి అని వినికిడి. అయితే పనిలో పనిగా నెల్లూరు, తడ చుట్టుపక్కల ప్రాంతాల భూముల గురించి ఆయన ఆరా తీసినట్లు నెల్లూరు వర్గాల బోగట్టా. ఇటీవల రాజకీయ నాయకులు, సినిమా జనాలు ఈ ప్రాంతంలో భూములు కొనడంపై ఆసక్తికనబరుస్తున్నారు.
పైగా కొందరు కొన్నారు. మరి కొందరు అదే పనిలో వున్నారని గుసగుసలు వనన్నాయి. మరి పనిలో పనిగా అరవింద్ కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నారా అన్నది అనుమానం.
అరవింద్ మాత్రమే కాదు, పెద్దలు చాలా మంది నెల్లూరు రావడం, పోర్టు గెస్ట్ హవుస్ లో బస చేయడం, రియల్ ఎస్టేట్ వ్యవహారాలపై చర్చలు జరపడం మామూలుగా మారిందన్నది నెల్లూరు జనాల్లో సర్కులేషన్ లో వున్న గ్యాసిప్.